‘లక్ష్మీరావే మా ఇంటికి’ దర్శకుడు నంద్యాల రవి ఇంటికి మాత్రం లక్ష్మీ రాలేదుగానీ కరోనా మాత్రం వచ్చింది. ఆయన ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రమే. ప్రస్తుతం ఆయన కామెడీ హీరో సప్తగిరితో సినిమా చేస్తున్నారు. కోవిడ్ తో బాధపడుతూ పది రోజులుగా ఆస్పత్రిలో చికిత్సిపొందుతున్నారు. ఒక దశలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆస్పత్రి బిల్లు దాదాపు ఆరేడు లక్షల దాకా చెల్లించాల్సి ఉందట.
ఈ దశలో ఆయన సినిమాలో హీరోగా నటిస్తున్న సప్తగిరి ఆర్థికంగా కొంత చేయూతను అందించారు. తనవంతు సాయంగా లక్ష రూపాయలను అందజేశారు. సని పరిశ్రమలోని పెద్దలు కూడా రవి కుటుంబానికి సాయం అందిస్తే బాగుంటుందని పలువురు అభ్యర్థిస్తున్నారు. రవి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
రవికి నిర్మాత రాధామోహన్ రూ. లక్ష సాయం
దర్శకుడు, రచయిత నంద్యాల రవికి శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత, నిర్మాత కె.కె. రాధామోహన్ కూడా లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అంతేకాకుండా డాక్టర్ జాఫర్‌తో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆయన తెలుసుకుంటున్నారు. ప్లాస్మా డొనేట్ చేయడంలో కూడా రాధామోహన్ కో ఆర్డినేట్ చేశారు.