సైఫ్ అలీ ఖాన్ పుత్రికా రత్నం సారా అలీఖాన్ కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమె ఏం చేసినా ఆ అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య ఆమె తన స్నేహితుడితో కలిసిన వేసిన ట్రిప్ ఫొటోలను షేర్ చేసింది. అతను ఎలాంటి స్నేహితుడా అని అందరూ రకరకాల ఊహాగానాలు చేసేస్తుంటారు. ఆమె వ్యక్తి గత జీవితం మాత్రం తెరిచిన పుస్తకమే. ఏదీ దాపరికం ఉండదు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్ ల కూతురు సారా అనే సంగతి తెలిసిందే.

సైఫ్ ఆ తర్వాత అమృతకు విడాకులు ఇచ్చి కరీనా కపూర్ ను పెళ్లి చేసుకున్నాడు. సారా అలీ ఖాన్ తాజాగా అక్షయ్ కుమార్, ధనుష్ లతో అట్రాంగి రే సినిమా చేస్తోంది. ఆ మధ్య తన సోదరుడు ఇబ్రహీం అలీఖాన్, ఇతర సన్నిహితులతో కలిసి టూర్ చేసినప్పుడు కూడా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇటీవల ఆమె నటిగా బిజీ అయిపోయింది. పర్యటనలు కాస్త తగ్గించుకుంది. పాత ప్రయాణాలను గుర్తు చేసుకోవాలనుకుందో ఏమో తన క్లోజ్ ఫ్రెండ్ జేహన్ కలిసి టూర్ చేసిన ఫోటోలను రీపోస్ట్ చేసింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రెండు లోకేషన్లలో ఆమె ఈ ఫొటోలు దిగింది. ఓ ఫొటోలో బ్లూ జీన్స్ ధరించి ఉంది.
మరో ఫొటోలో వైట్ టాప్ తో కనిపించింది. ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె తాజా చిత్రం అట్రాంగిరే ఆగస్టులో విడుదల కానుంది. దీనికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. భూషణ్ కుమార్ దీన్ని నిర్మిస్తున్నారు. దీంతో పాటు విక్కీ కౌశల్ తో కలిసి మరో సినిమాలోనూ సారా నటిస్తోంది. దీని పేరు ఇమ్మోర్టల్ అశ్వత్థామ. దీనికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తారు. అప్పుడప్పుడు అందాల ఆరబోతకు కూడా సారా వెనకాడదు. ఇటీవలే ఓ పొట్టి గౌను ధరించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇలా ఆమె షేర్ చసే ఫొటోలను ఆమె అభిమానులు మనసారా అస్వాదిస్తున్నారు.
Also Read:వివాదాస్పద వ్యాఖ్యలపై సైఫ్ వివరణ











