సర్కారు వారి పాట.. సూపర్ స్టార్ మహేష్ బాబీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా. ఈ మూవీ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా అది వైరల్ గా మారిపోతోంది అంటే అభిమానుల్లో ఈ చిత్రం పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.తాజాగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను వచ్చే 12న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కాగా, ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
కాగా , ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ట్రాక్‌ను చిత్రబృందం తాజాగా రిలీజ్ చేసింది.ఈ సాంగ్ లో హీరో పాత్ర తాలూకా స్వభావాన్ని తెలుపుతూ..‘సర్కారు వారి పాట..షురూ షురూ అన్నాడురా అల్లూరి వారి బేటా..వెపన్స్ లేని వేట..రివర్సు లేని బాటా’..అనే లైన్స్‌తో గేయరచయిత అనంత్ శ్రీరామ్ రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక పాటకు థమన్ కంపోజిషన్ మరోసారి అదిరిపోయిందనే టాక్ కూడా అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. ఇక పాట వింటుంటేనే పూనకం వచ్చేలా ఉందని, అదే బిగ్ స్క్రీన్ పై పూర్తి విజువల్స్‌తో చూస్తే అరుపులే అన్నట్లు ఉంటుందని అని మహేష్ అభిమానులు నెట్టింట పోస్ట్ లు పెడుతున్నారు.దీంతో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయనేది స్పష్టం అవుతోంది.