విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జైన శశికళకు.. ఆసుపత్రి వెలుపల ఘనస్వాగతం లభించింది. శశికళ ప్రయాణించిన కారుపై అన్నాడీయంకే పార్టీ జెండా ఉండడం అందరి దృష్టిని ఆకర్షించింది. తిరిగి తమిళనాడు చేరుకున్న తర్వాత అన్నాడీయంకే పార్టీలోనే ఉంటారా అనే అనుమానాలకు తావిస్తుంది. కానీ గతంలోనే శశికళను పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. చిన్నమ్మ రాజకీయ జీవితం ఎలా ఉండబోతుందనే విషయమై విశ్లేషకులు పలు అంచనాలు వేస్తున్నారు. తిరిగి అన్నాడీయంకే పార్టీని దక్కించుకుంటారా లేదా వేరు కంపటి పెట్టి ఎన్నికల్లో తన సత్తా చాటడానికి సిద్దమవుతారా అనే విషయాలపై పలు రకాలుగా అంచనాలు వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
జైలు నుంచి విడుదలవ్వడానికి కొద్ది రోజుల ముందు కరోనా బారిన పడి విక్టోరియా ఆసుపత్రిలో చేరారు. హాస్పటల్ నుంచే విడుదలకు అవసరమైన పనులన్నీ పూర్తి చేశారు శశికళ. చివరకు టెస్టుల్లో నెగిటివ్ రావడంతో ఆసుపత్రి వర్గాలు ఆమెను డిశ్చార్జ్ చేశారు. బెంగుళూరులో ఐసోలేషన్ ముగిసిన మీదట చిన్నమ్మ అడుగు ఎటు వైపు వేస్తారో చూడాలి.
Must Read ;- తమిళనాట మోదీకి ‘చిన్నమ్మ’ పెద్దదెబ్బ.. ఏబీసీ న్యూస్-సీ ఓటర్ సర్వే