వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన విశ్వసనీయ, నమ్మదగిన వ్యక్తి కాదని తేల్చి పారేశారు.. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా ఉండాలని, ధైర్యంగా ఎదుర్కోవాలని, భయపడి పారిపోవాల్సిన పనిలేదని జగన్ వ్యాఖ్యానించారు.. రాజకీయాలు 5 ఏళ్లకు ఒకసారి మారిపోతుంటాయని, ఓడిపోతే ధైర్యంగా పోరాడాలని హితవు పలికారు.. విజయసాయి రాజీనామాపై స్పందించాలని కోరిన విలేకరుల ప్రశ్నకు ఆయన ఈ విధంగా రియాక్ట్ అయ్యారు..
జగన్ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుండే నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.. జగన్ కోసం, జగన్ వెంట నడిచిన అతికొద్ది మంది నేతలలో విజయసాయి ఒకరు.. జగన్ కోసం ఏడాదిన్నరపాటు జైలు జీవితం అనుభవించాడు విజయసాయి రెడ్డి.. ఆయన చేసిన తప్పులు, పాపాలకు రాజ్యసభ మాజీ ఎంపీ సైతం బాధ్యులయ్యారు.. 2014 నుండి 19 మధ్య కాలంలో వైసీపీ సోషల్ మీడియాని దగ్గరుండి నడిపించారు A2. ఇటు, ఢిల్లీలో బీజేపీకి గతంలో టీడీపీ దూరం కావడానికి తెరవెనక కుట్రని మొత్తం నడిపించిన వ్యక్తి విజయసాయి రెడ్డి అని గుర్తు చేయాల్సిన పనిలేదు.. జగన్ మదిలో ఏముందో తెలుసుకొని, ఆయన కార్యాలను చక్కబెట్టేవారు.. ఆయనపై ఈగ వాలితే తన నోటికి, ట్విట్టర్‌కి పని చెప్పేవాడు విజయసాయి రెడ్డి..
అంతగా జగన్ కోసం పోరాడిన వ్యక్తి.. ఇటీవల ఆయనకు దూరం అయ్యారు.. అంతే, విజయసాయి రెడ్డిపై విషం కక్కడం మొదలుపెట్టాడు జగన్.. ఆయన మారిపోయాడని, ఓడిపోయిన తర్వాత తనను వీడి వెళ్లాడని అర్ధం వచ్చేలా కామెంట్స్ చేశారు.. అయితే, ఇదంతా డ్రామా అంటున్నారు టీడీపీ నేతలు.. విజయసాయి పార్టీని వీడడం వెనక పక్కా స్కెచ్ ఉందని విశ్లేషిస్తున్నారు.. ఎందుకంటే, జగన్, విజయసాయిది ఫెవికాల్ బంధం.. ఎవరు విడదీసినా, ఎంత ఊడపీకినా కలిసిపోతారు.. ఒకరు కర్త అయితే, మరొకరు కర్మ.. జగన్ రెడ్డికి అత్యంత విశ్వసనీయ వ్యక్తిగా, నమ్మినబంటుగా విజయసాయి రెడ్డికి పేరుంది.. అంతేకాదు, జగన్ రెడ్డి స్కీములలో ఎంతటి బలమైన పాత్ర ఉందో తెలియదు కానీ, స్కీమ్‌లకి ఆయనే మాస్టర్ మైండ్.. విజయసాయి రెడ్డి తన చార్టెర్డ్ అకౌంటెంట్ తెలివితేటలను ఉపయోగించి, సూట్ కేసు కంపెనీలను ప్రారంభించారు.. జగన్ అవినీతి, అక్రమాల చిట్టాలకు పునాది పడిందే విజయసాయి రెడ్డి కార్యాలయం అని చెబుతారు వారి సన్నిహితులు.. అందుకే, పార్టీలోనే కాదు, అవినీతిలోనూ ఈ ఇద్దరూ A1, A2లు అని ముద్ర పడింది..
అలాంటి విజయసాయి రెడ్డి పార్టీని జగన్ దూరం చేసుకోడు.. చేసుకున్నాడంటే, దానివెనక భారీ స్కెచ్ ఉంటుందని ఊహించాలని గుర్తు చేస్తున్నారు.. జగన్ అణువణువు తెలిసిన వ్యక్తిని, ఆయన ఎందుకు వదులుకుంటాడని కొందరు ప్రశ్నిస్తుంటే, జగన్ కుటుంబం వలనే తనకు ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయని, ఆ ఫ్యామిలీకి తాను ఎప్పటికీ సేవకుడినే అని బహిరంగంగా చెప్పే వ్యక్తి ఎందుకు దూరం అవుతాడని నిలదీస్తున్నారు.. అయితే, ఈ స్కెచ్ ఏంటి..? దాని వెనక స్కామ్ ఏంటి..? అనేది త్వరలోనే వెలుగులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. మరి, ఏ1, ఏ2లు ఈ సారి ఎలాంటి స్కీమ్ ప్లాన్ చేశారో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు..