జగన్ రెడ్డి రాజకీయ వ్యూహాలు సొంత పార్టీ వారికే అంతుచిక్కని పరిస్దితి. ఏపీలో దళితులను టార్గెట్ చేసి.. ఆయన సాగిస్తున్న పాలన బడుగు బలహీన వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.
జగన్ రెడ్డి 56 నెలల పాలనలో 6 వేల మంది దళితులను ప్రత్యక్షంగా.., పరోక్షంగా ఊచకోత కోశారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేలా సాగిన పాలన.. నేడు దళితులను టార్గెట్ చేసి.. సిట్టింగ్ స్ధానాలకు సీట్లు లేవని జగన్ చెప్పడం.. నమ్ముకున్న ఉంటున్న వారిని ఉరి తీయ్యడం కాదా..? అని ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. రాష్ట్రంలో 27 ఎస్సీ, 7 గిరిజన రిజర్వుడు స్ధానాలలో వైసీపీ అభ్యర్ధుల మార్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం రాజాం నుంచి చిత్తూరు పూతలపట్టు వరకు ఉన్న ఎస్సీ,ఎస్టీ నియోజవర్గాల్లో వైసీపీ సిట్టింగ్ మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. అందుకు తగ్గట్లు వైసీపీ రంగం సిద్ధం చేసుకుంటుందన్నది వాస్తవం.
జగన్ రెడ్డితో పాటు ఆయన చుట్టూ ఉన్న క్వాటరీ దాటికి సొంత కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు సైతం పారిపోతున్నారు. జగన్ రెడ్డికి దూరంగా జరిగి.., సొంత కుంపటి పెట్టుకునేందుకు సిద్దమవుతున్నారు. ఆ నేపధ్యంలోనే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా.., ఎమ్మెల్సీ వంశీకృష్ణయాదవ్ జనసేన తీర్ధ పుచ్చుకోవడం వంటివి సాక్ష్యాలు. అలానే దాదాపు 90 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్ధితి ఇదే విధంగా ఉన్నది అన్నది వైసీపీ నుంచి బహిరంగంగా వినిపిస్తున్న మాటలే. ఈ క్రమంలో జగన్ పై పూతలపట్టు ఎమ్మెల్యే బాబు ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. వైసీపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎమ్మెల్యేల పేరుకే తప్ప.. ఒక్కరోజు కూడా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్ధితి అని కుండబద్ధలు కొట్టారు. పూతలపట్టులో ఎమ్మెల్యేగా ఉన్న నాపై నిత్యం రెడ్డి సామాజీకవర్గానికి చెందిన మంత్రులు, నేతల పెత్తనం చేశారని వాపోయిన సంచలన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదిలా ఉంటే ఎంపీ విజయసాయిరెడ్డి సొంత బావ ద్వారకానాధ్ రెడ్డి కూడా కుటుంబ సమేతంగా వైసీనీని వీడి టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారని క్లారిటీ వచ్చింది. చంద్రబాబు సమక్షంలో కుటుంబం మొత్తం టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇలా వైసీపీలో ఉన్న బడుగు బలహీన, అనగారిన వర్గాల ఎమ్మెల్యేలతో పాటు రెడ్డి సామాజీకవర్గంలోని ప్రధాన నేతలకు సైతం జగన్ నిర్ణయాలకు విసిగి వేజారుతున్నారన్నది అక్షర సత్యం.