ఈ నెల 8న జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అన్ని పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని విజ్ఙప్తి చేశారు. ఎక్కడ నిలిచిపోయాయో అక్కడి నుంచే ఎన్నికలు నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేశారు. జడ్పీ ఎన్నికలు 2018లోనే జరగాల్సి ఉందని, ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని ఆమె గుర్తు చేశారు. అన్ని పార్టీలు జడ్పీ ఎన్నికలకు సహకరించాలని నీలం సాహ్ని కోరారు. ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకుంటే, తరవాత కరోనా టీకా వేసే ప్రక్రియను పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉందన్నారు. గతంలో ఉన్న నోడల్ ఆఫీసర్లే ఇప్పుడు కూడా కొనసాగుతున్నారని నీలం సాహ్ని గుర్తు చేశారు.
కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది
ఏపీలో కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందని ఎస్ఈసీ ప్రకటించారు. ఏప్రిల్ 8వ తేదీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సిద్దంగా ఉందని నీలం సాహ్ని ప్రకటించారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయిందని, బ్యాలెట్లు కూడా సిద్దం చేశామని నీలం సాహ్ని తెలిపారు. ఎన్నికలు నిష్ఫక్షపాతంగా జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ఆమె కోరారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని, ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నట్టు ఎస్ఈసీ నీలం సాహ్ని వెల్లడించారు.
Also Read:జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ ఇవ్వలేం.. నిమ్మగడ్డ