తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామాన్ని మంగళవారం ఎస్ఈసీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలు సందర్శించి శ్రీనివాసరెడ్డి మృతిపై వివరాలు తెలుసుకున్నారు. రెండు రోజుల కిందట శ్రీనివాసరెడ్డి, తన భార్య పుష్పవతితో టీడీపీ బలపరిచిన గొల్లలగుంట సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయించారు. ఆ తర్వాత కొందరు శ్రీనివాసరెడ్డిని కిడ్నాప్ చేసి మత్తుమందు ఇచ్చి చేతులు కాళ్లు కట్టేసి పొలంలో వదిలేశారు. తర్వాత వైసీపీ నేతల బెదిరింపులతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేగాక శ్రీనివాసరెడ్డిని పోలీస్ స్టేషన్కు పిలిచి విచారించారు. విచారణ అనంతరం మధ్యాహ్నం పొలంలో ఉరి వేసుకుని శ్రీనివాసరెడ్డి మృతి చెందడంపై అనుమానాలు కలుగుతున్నాయి. వైసీపీ శ్రేణుల బెదిరింపుల వల్లే శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలు సందర్శించి మృతుడి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Must Read ;- వైసీపీ నేతల బెదిరింపులకు సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్య