జగన్ అక్రమాస్తుల కేసులపై కోర్టులు స్పందిస్తున్నాయి. దాదాపు దశాబ్ధకాలంగా బెయిల్ పై బయటున్న జగన్ కు ఈ సారి జీవితకాలం జైలు తప్పదన్నట్లు కనిపిస్తోంది.
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై కోర్టులు స్పందిస్తున్న తీరు త్వరలో ఆయన జైలుకుపోవడం ఖాయం అన్న సంకేతాన్ని సూచిస్తున్నాయి. బుధవారం తెంలగాణ హైకోర్టు జగన్ అక్రమాస్తుల కేసుపై స్పందించింది. మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య జగన్ అక్రమాస్తులపై దాఖలు చేసిన పిల్ పై విచారణ చేపట్టింది. జగన్ అక్రమాస్తుల కేసు సీబీఐ కోర్టులో తీవ్ర జాప్యం జరుగుతోందని.., 2024 ఎన్నికల లోపే విచారణ జరిపి.., నిందులను శిక్షించాలని కోరారు. అయితే హరిజోగి రామయ్య వేసిన పిల్ ను ముందుగా హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతర తెలిపింది. ఈ అభ్యంతరంపై సుదీర్ఘ వాదనలను జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ ఎన్వీ శ్రావణ్ కుమార్ విన్నారు. ఈ పిటిషన్ పిల్ గా మార్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది ధర్మాసనం.
ధర్మాసనం ముందు హరిరామ జోగయ్య తరుఫున న్యాయవాధి పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలను బలంగా వినింపించారు. వాదనలలో మెరిట్స్ ఆధారంగా న్యాయవాది రాధాకృష్ణ వాదనలతో ఏకభవించారు. పిల్ నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశింది హైకోర్టు. అంతేకాక విచారణ ఎందుకు వేగవంత చేయలేకపోతున్నారు..? బెయిల్ గడువును ఎన్ని రోజులు పొడిగిస్తారు…? జగన్ అడిగినప్పుడుల్లా వేలల్లో వాయిదాలు ఎందుకిచ్చారు..? తదితర అంశాలను ప్రశ్నిస్తూ.. హైకోర్టు సీబీఐ, సీబీఐ కోర్టుకు హై కోర్టు నోటిసులు జారీ చేసినట్లు సమాచారం. అలానే జగన్ కు కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఆ మొన్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీం కోర్టులో జగన్ బెయిల్ విషయంలో, కోర్టు బదిలీపై పిటిషన్ దాఖలు చేయగా.. స్పందించిన సుప్రీం జగన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే.