నేచురల్ స్టార్ నానీ సినీ కెరీర్ కి ‘జెర్సీ’ సినిమా ఒక మైలురాయి లాంటిది. క్రికెట్ నేపథ్యంలో ఎమోషనల్ హార్ట్ టచింగ్ స్టోరీగా ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. సినిమాకి కాసులు అంతగా కురవకపోయినా.. ప్రశంసలు మాత్రం చాలానే దక్కాయి. అందుకే ఈ సినిమాను బాలీవుడ్ తెరమీదకు ఎక్కిస్తున్నారు. ఒరిజినల్ దర్శకుడు గౌతమే హిందీ వెర్షన్ నూ డైరెక్ట్ చేస్తున్నాడు. షాహిద్ కపూర్ హీరోగా హిందీ జెర్సీ ప్రస్తుతం సెట్స్ మీదుంది.
తాజా సమాచారం ప్రకారం షాహిద్ ఉత్తరఖండ్ లో తెరకెక్కుతోన్న కీలక సన్నివేశాల్ని పూర్తి చేశాడట. నవంబర్ 9నుంచి చండీఘర్ లో ఆఖరి షెడ్యూల్ మొదలు కాబోతోందని తెలుస్తోంది. అక్కడ 15 రోజులు పాటు చిత్రీకరణ జరుగుతుంది. క్రికెట్ కు సంబంధించిన కీలకమైన సన్నివేశాలన్నీ అక్కడే జరగబోతున్నాయి. దిల్ రాజు, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా కోసం షాహిద్ కొద్ది రోజులు క్రికెట్ కూడా ప్రాక్టీస్ చేశాడు. నిజంగా ఈ రోల్ చేయడం తనకు చాలా ఎక్సైటింగ్ గా ఉందంటున్నాడు షాహిద్. మరి బాలీవుడ్ జెర్సీ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.