సత్కరించుకుని, విందులు చేసుకుని ఉమ్మడి శత్రవును ఓడించిన ఇద్దరు సీఎంలకు ప్రజల సమస్యపై చర్చించటానికి రెండు నిముషాలు కూడ నిజంగా తీరిక దొరకడం లేదా? ప్రస్తుతం నెలకొన్న కృష్ణా జలాల వివాదంపై బోర్డుకు పరస్పరం లేఖలు రాస్తున్న సీఎంలు కూర్చుని చర్చించుకోవచ్చు కదా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇదే విషయమై నిన్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్బావ సభలో షర్మిల కూడ ఘాటు వ్యాఖ్యలే చేశారు. అంతకు ముందు కూడ షర్మిల తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ఎవరైనా సరే ఊరుకునేది లేదని అన్నారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ ఏపీ ప్రజల సమస్యల పరిష్కారంలో జగన్ సర్కార్‌కు చిత్తశుద్ది లేదంటూ టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ విమర్శించారు.
స్వప్రయోజనాల కోసం..
నీటి వివాదంపై షర్మిల అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం జగన్‌కు, వైసీపీ నాయకులకు ఉందా అని అనురాధ అన్నారు. తమ స్వప్రయోజనాలకు ఏపీ ప్రజల ప్రయోజనాలను జగన్‌తో సహా వైసీపీ నాయకులు ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆమె ఆరోపించారు. కేసీఆర్‌తో సహా తెలంగాణ మంత్రులతో అనేక మంది వైసీపీ నేతలకు సత్సంబంధాలు ఉన్నాయని అనురాధ పేర్కొన్నారు. జగన్ చేసిన మోసాలకు అక్క ఢిల్లీలో పోరాడుతుంటే చెల్లెలు హైదరాబాద్ నుంచి పోరాటానికి సిద్ధమైందని అన్నారు. వ్యవసాయ రంగానికి ఏం చేశారని వైఎస్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించారని అనురాధ ప్రశ్నించారు. వైఎస్ హయాంలో ఎరువుల కోసం క్యూలో నిలబడిన రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయం మరిచారా అని అన్నారు. ఆ విధంగా నాడు సోంపేట, కాకరాపల్లి, ముదిగొండలో 12 మంది రైతులను బలిగొన్నారన్నారు. వైఎస్ హయాంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేక 14 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్ లు ఇద్దరూ స్వప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాల ముందు సాగిలపడ్డారని విమర్శించారు.
మ్యాచ్ పిక్సింగేనా..
మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నీటి వివాదం సెంటిమెంట్‌తో కేసీఆర్ లబ్ది పొందాలని చూస్తున్నారని బీజేపీ సహా ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీంతోనే తెలంగాణ మంత్రులు ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల విషయం కేసీఆర్‌కు పూర్తిగా తెలుసని, ఇద్దరు సీఎంలు మ్యాచ్ పిక్సింగ్ చేసుకుని రకరకాల వ్యాఖ్యలతో ప్రజలను మభ్యపెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.చూడాలి మరి కృష్ణా నీటి వివాదం ఎంత కాలం సాగుతుందో..!
Must Read ;- జగన్ గారు.. విజయమ్మను గెంటేస్తారా..?











