శివరాజ్ కుమార్ హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా సినిమా ఘోస్ట్ కొత్త పోస్టర్ చూస్తుంటే ఇది ఓ యాక్షన్ థమాకా అని అర్థమవుతోంది. ముఖ్యంగా హీరో శివరాజ్ కుమార్ రగ్ డ్ లుక్ లో కనిపిస్తున్నాడు. కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీని షూటింగ్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కన్నడ చిత్రాలు కొత్త రికార్డులు క్రియేట్ చేయడంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని మలుస్తున్నట్టు తెలుస్తోంది. కేజీఎఫ్, కాంతార రికార్డులను బద్దలు కొట్టాలన్న టార్గెట్ తో ఇతర హీరోలు పనిచేస్తున్నారు. డిసెంబరు రెండో వారంలో భారీ సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరగబోతోంది. ఈ యాక్షన్ హైస్ట్ థ్రిల్లర్ కి కన్నడ బ్లాక్ బస్టర్ ‘బీర్బల్’ దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రముఖ రాజకీయనేత, నిర్మాత అయిన సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా 28 రోజుల పాటు సాగిన మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ కోసం రూ. 6 కోట్ల వ్యయంతో భారీగా జైల్ ఇంటీరియర్ సెట్ వేశారట. ఆ షూటింగ్ కు సంబంధించిన స్టిల్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. డిసెంబరు రెండో వారం నుంచి రెండో షెడ్యుల్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. దీని కోసం జైలు వెలుపల సెట్ ను భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. శి
వ రాజ్ కుమార్ కొత్త పోస్టర్ చూస్తుంటే తుపాకీ తన అధికారం అన్నట్టుగా పట్టుకుని తీక్షణంగా చూస్తున్న లుక్ ఇది. ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ ఇందులో కీలక పాత్ర పోషిస్తుండగా ప్రశాంత్ నారాయణ్, అచ్యుత్ కుమార్, దత్తన్న, అవినాష్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. కేజీఎఫ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ ఈ సినిమాకి సెట్స్ వేశారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. సందేశ్ ప్రొడక్షన్స్ కు ఇది 29వ చిత్రం.