ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానులు ఎప్పుడెప్పుడు పుష్ప ధియేటర్లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 17న పుష్ప ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.
అయితే.. పుష్ప చిత్రాన్ని ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. మరి.. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందంటే.. షాక్ విషయం తెలిసింది. ఏంటంటే.. ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో థియేట్రికల్ మరియు నాన్ థియేట్రటికల్ హక్కులు సహా ఓటీటీ హక్కులు కలిపి 250 కోట్లు వరకు బిజినెస్ జరిగిందట. బన్నీ అల వైకుంఠపురంలో.. సుకుమార్ రంగస్థలం తర్వాత చేసిని కావడంతో ఈరేంజ్ లో బిజినెస్ జరిగిందని చెప్పచ్చు.
రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో బాక్సాఫీస్ దగ్గర ఏరేంజ్ సక్సస్ సాధిస్తుందనేది ఆసక్తిగా మారింది. మరి.. బన్నీ, సుక్కు కలిసి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తారోచూడాలి.
Must Read ;- ‘పుష్ప’లో సమంత ఐటమ్ అంతా బూతేనట











