Shocking Remuneration For Zombie Reddy Movie Hero Teja Sajja :
ఓ బేబి సినిమాలో ముఖ్య పాత్ర పోషించి మెప్పించిన యువ హీరో తేజ సజ్జా. ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. డిఫరెంట్ జానర్ లో.. టాలీవుడ్ లో చేసిన సరికొత్త ప్రయోగం జాంబిరెడ్డి. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. బాల నటుడిగా.. ఇంద్ర సినిమాలో జూనియర్ ఇంద్రసేనా రెడ్డిగా తొడకొట్టిన తేజ సజ్జా హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి తొలి ప్రయత్నంలోనే సక్సస్ సాధించాడు. ఇండస్ట్రీకి మరో యంగ్ హీరో వచ్చాడనిపించుకున్నాడు. జాంబిరెడ్డి జోనర్ అనేది హాలీవుడ్‌లో చాలా ఫేమస్ జానర్.
అక్కడ ప్రతీ యేడు ఈ జానర్ లో సినిమాలు చేస్తున్నారు. ఇది చాలా…సక్సెస్ ఫుల్ జానర్. అయితే మన దేశంలో హిందీలో ఒకటి.. తమిళ్‌లో ఒకటి వచ్చాయి. తెలుగులో మాత్రం మొదటి సారిగా ఈ జాంబీ జానర్ లో సినిమా వచ్చింది. అయితే ఈ జానర్ ని కామెడీతో డీల్ చేయటం అనేది డైరక్టర్ ప్రశాంత్ వర్మ చేసిన తెలివైన పని. ఈ సినిమా సక్సస్ సాధించడంతో తేజ ఇప్పుడు మంచి జోరు మీదున్నాడు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం హను-మాన్ అనే చిత్రంలో తేజ నటిస్తున్నాడు.
జాంబిరెడ్డితో హిట్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోనే మరోసారి సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు తేజ. తెలుగులో తొలి సూపర్ హీరో సిరీస్‌గా ఫిక్షనల్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమా కోసం తేజ సజ్జ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఎంతంటే.. ఈ టాలెంటెడ్ హీరో ఇప్పుడు అక్షరాల కోటి రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడట. హను మాన్ మూవీ కూడా సక్సస్ అయితే.. ఈ యంగ్ హీరో రెమ్యూనరేషన్ మరింత పెంచేస్తాడేమో.
Must Read ;- సమంతకు భారీ ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్











