సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘గీత గోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కరోనా లేకపోతే.. సమ్మర్ తర్వాతే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నారు. 2021 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా వలన ప్లానింగ్ అంతా మారింది. కరోనా తగ్గింది. అమెరికాలో షెడ్యూల్ స్టార్ట్ చేద్దామనుకున్నారు. అయితే.. అక్కడ ఇంకా కరోనా తగ్గకపోవడం.. వీసా ప్రాబ్లమ్స్ రావడంతో షూటింగ్ ప్లాన్ మారింది.
Also Read ;- ‘ఎఫ్ 3’లో ఐదుగురు హీరోయిన్లు.. ఎవరా ముద్దుగుమ్మలు?
లేటేస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జనవరి 25నుంచి ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందిస్తున్న భారీ సెట్ లో ఈ సినిమా కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇక ఫిబ్రవరిలో గోవాలో షూటింగ్ ప్లాన్ చేశారు. అక్కడ షెడ్యూల్ పూర్తైన తర్వాత మూడో షెడ్యూల్ అమెరికాలో చేస్తారని సమాచారం. అమెరికాలో దాదాపు నలభై రోజులు పాటు షూటింగ్ చేయనున్నారు. ఇందులో మహేష్ సరసన మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తుంది. జనవరి నుంచి కీర్తి సురేష్ షూటింగ్ లో జాయిన్ కానుంది.
అయితే.. ఇందులో నటించే విలన్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ చేయలేదు. బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కఫూర్ తో సంప్రదింపులు జరుపుతున్నారు కానీ.. ఇంకా ఫైనల్ కాలేదు. ఈ నెలలో విలన్ ఎవరు అనేది ఫైనల్ చేసి అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ‘భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు’.. ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్న మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమాతో మరో హ్యాట్రిక్ కు శ్రీకారం చుడతాడని ఆశిద్దాం.
Must Read ;- ‘సర్కారు వారి పాట’ ప్లాన్ మారింది.. ఏంటా ప్లాన్?