మెగా స్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్యనే తిరిగి పట్టాలెక్కిన ఈ సినిమా షూటింగ్ లో త్వరలోనే చిరు జాయిన్ అవుతారు. దీని తర్వాత చిరు ‘లూసిఫర్’ మలయాళ సూపర్ హిట్టు సినిమాను రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. షూటింగ్ వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుందని సమాచారం. ఈలోపు ‘ఆచార్య’ పూర్తి చేసుకొని కొంచెం కూడా గ్యాప్ తీసుకోకుండా వెంటనే ‘లూసిఫర్’ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్.
ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయాన్ని త్వరలో నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా దర్శకుడి విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. ‘లూసిఫర్’ రీమేక్ నుండి వినాయక్ ను తప్పించారని ఇటీవల వార్తలు వినిపించాయి. ‘లూసిఫర్’ కథను మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్చడంలో వినాయక్ విఫలం చెందారని అందుకనే ఆయన స్థానంలో తమిళ్ దర్శకుడు మోహన్ రాజాను తీసుకొనే ఆలోచనలో చిరు ఉన్నారని వార్తలు వినిపించాయి.
అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆ వార్తలు నిజం కాదని ‘లూసిఫర్’ రీమేక్ సినిమాకు వినాయక్ నే దర్శకుడిగా చిరు ఫైనల్ చేసారని టాలీవుడ్ సమాచారం. ఇప్పటికే వినాయక్ రైటర్ ఆకుల శివతో కలిసి ఈ సినిమాకు సంబంధించిన కథను పక్కాగా రెడీ చేసుకున్నాడని తెలుస్తోంది. ఇక ‘లూసిఫర్’ సినిమాలో మోహన్ లాల్ కు చెల్లెలుగా మంజు వారియర్ నటించిన పాత్రను తెలుగులో సీనియర్ హీరోయిన్ సుహాసిని నటిస్తోంది. ఈ సినిమాతో తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు వినాయక్. ‘లూసిఫర్’ సినిమాపై పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు అభిమానులు ఆగాల్సిందే మరి.
Must Read ;- ‘నర్తనశాల’ బాటలో ఆగిపోయిన చిరంజీవి సినిమా?











