కమల్ హాసన్ తనయ శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో చాలా సినిమాలు చేసింది. ఒకప్పటి బాలీవుడ్ నటి సారిక, కమల్ హాసన్ ల సంతానమే శ్రుతి. సారిక, కమల్ విడిపోయినా శ్రుతి మాత్రం తండ్రి దగ్గరే పెరిగింది. తాజా వార్త ఏమిటంటే నిన్న దీపావళి పర్వదినాన్ని శ్రుతి హాసన్ తన కొత్త ప్రియుడు శాంతను హజారికాతో కలిసి జరుపుకొన్నారు. మొదట్లో లండన్ గాయకుడు మైకేల్ కోర్సలేతో ఆమె చెట్టపట్టాలేసుకు తిరిగింది. ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పేసింది.
ఓ పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే కొత్త ప్రియుడికి దగ్గరైంది. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు వీరిద్దరూ బహిరంగంగానే తిరుగుతున్నారు. రాత్రి దీపావళిని కూడా ఇద్దరూ కలిసి జరుపుకున్నారు. సోషల్ మీడియాలో శ్రుతి షేర్ చేస్తున్న ఫొటోలు ఈ విషయాన్ని బహిరంగ పరుస్తున్నాయి. దీపావళి సందర్భంగా శ్రుతి తన ఇన్స్టా గ్రామ్ అకౌంట్ లో ఓ ఫొటో షేర్ చేసింది. అదిప్పుడు వైరల్ గా మారింది. అందులో ఇద్దరూ కౌగిలించుకుని ఉన్నారు.
‘మా పరిపూర్ణమైన దీపావళికి అసంపూర్ణమైన ఫొటో.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు’ అంటూ ఆమె కామెంట్ చేసింది. సెలబ్రిటీలు ఏంచేసినా అది పెద్దగా వైరల్ అవుతుండటం సర్వసాధారణం. ప్రస్తుత సమాజంలో డేటింగ్ లు, లివింగ్ రిలేషన్ షిప్ సర్వసాధారణమే అయినా సెలబ్రిటీల విషయంలో ఇలాంటివి జరిగితే మాత్రం బూతద్దంలో చూస్తున్నారు. శ్రుతి వ్యక్తిగతం జీవితం గురించి ఆమె బహిరంగంగానే పోస్టులు పెడుతున్నప్పుడు నెటిజన్లకు వచ్చే ఇబ్బంది కూడా ఏమీ లేదు.
Must Read ;- విడాకుల పర్వంలో హీరో కుమార్తె?