Shruti Haasan Waiting For Success :
వెండితెరకు నాజూకు అందాన్ని పరిచయం చేసిన కథానాయికలలో శ్రుతిహాసన్ ముందువరుసలో కనిపిస్తుంది. తెలుగు తమిళ భాషల్లో ఆమెకి చాలా క్రేజ్ ఉంది. చక్కని కనుముక్కుతీరుతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెరపై సీతాకోకచిలుకలా కనిపించే ఈ అమ్మాయిని చూస్తే, ఆమె సొగసుల వాకిట్లో మనసును ధారాదత్తం చేయవలసిందే. అంతలా ఆమె తన అందచందాలతో ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. కుర్రాళ్ల గుండె గోడలపై ఆరాధ్య దేవతగా పూజాలు అందుకుంటోంది.
అలాంటి శ్రుతిహాసన్ ధోరణి చాలా చిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. తమిళంలో విపరీతమైన క్రేజ్ ఉన్నప్పుడు తెలుగు సినిమాలపై దృష్టి పెట్టింది. తెలుగులో దూసుకుపోతున్న సమయంలో బాలీవుడ్ పై శ్రద్ధ పెట్టింది. బాలీవుడ్లో నిలదొక్కుకునే అవకాశాలు కనిపిస్తున్న సమయంలో టాలీవుడ్ ను .. కోలీవుడ్ ను పక్కనే పెట్టేసింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందనేది తిరిగి వంగి కూడా చూడలేదు. పోనీ బాలీవుడ్ లో నైనా కుదురుగా ఉందా అంటే అదీ లేదు. ఇలా మూడు భాషల్లోను ఆమె పూర్తి దృష్టి పెట్టలేకపోయింది.
ఇక కెరియర్ మసకబారడం మొదలైందని గ్రహించి మళ్లీ అవకాశాల కోసం రంగంలోకి దిగింది. అప్పుడు కూడా ముందుగా అవకాశం ఇచ్చింది తెలుగు సినిమానే. ‘క్రాక్’ సినిమా హిట్ తో ఆమె మళ్లీ గాడిలో పడిపోతుందని అంతా అనుకున్నారు. అందుకు తగినట్టుగానే ఆమె ‘సలార్‘ వంటి పెద్ద ప్రాజెక్టులో ఛాన్స్ సంపాదించింది. ఆ తరువాత కొత్తగా మరే ప్రాజెక్టులోను ఆమె పేరు కనిపించడం లేదు. హీరోలు ఒక సినిమా పూర్తిచేసేలోగా హీరోయిన్లు మూడు నాలుగు సినిమాలు పూర్తి చేయవచ్చు. కానీ ఇప్పుడు కూడా శ్రుతి హాసన్ తన దూకుడు పెంచే ఆలోచన చేయకపోవడం పట్ల అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ గ్యాప్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే చెప్పుకుంటున్నారు.
Must Read ;- అందాల ఆనందికి అదృష్టం పట్టేసినట్టే!