సాహసాల టీవీ షో ఖత్రోన్ కే ఖిలాడి సీజన్ 11 షూట్ లో శ్వేతా తివారీ, అనుష్కా సేన్ ‘చోటా ప్యాకెట్ బడా ధమాకా’ చేయబోతున్నట్టే ఉంది. ఈ షో 11వ సీజన్ చిత్రీకరణ కోసం యూనిట్ దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ కు వెళ్లింది. ఈసారి పోటీదారుల్లో బల్వీర్ నటి అనుష్కా సేన్ కూడా ఉంది. ఈ షో కోసం చాలామంది తారలు అక్కడికి వెళ్లారు. పోటీదారుల్లో ఉన్న శ్వేతా తివారి, అనుష్కా సేన్ కలిసి ఫోటోకు పోజిచ్చి తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. బాల్ వీర్ లో వీరిద్దరూ కలిసి నటించారు. వీరిద్దరి ఫోటోలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
ఈ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో అనుష్క షేర్ చేసింది. ఈ ఫొటోల్లో శ్వేత డెనిమ్ దుస్తుల్లో ఉంది. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుని మరీ కనిపించారు. అనుష్క శ్వేతను పొగడ్తలతో ముంచెత్తింది. చాలా ఏళ్ల తర్వాత తామిద్దరూ ఇలా కలవడం, కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది అనుష్క. నువ్వు చాలా మంచిదానికి అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. దానికి శ్వేత కూడా ప్రతిస్పందించింది. ‘నువ్వు చాలా ప్రతిభావంతురాలివి.. ధైర్యవంతురాలివి. నా చిన్న జేబులో పెద్ద బహుమతివి నువ్వే’ అంటూ బదులిచ్చింది.
పాపులర్ టీవీ షో ఖత్రోన్ కే ఖిలాడి స్టంట్స్ ప్రధానంగా సాగే రియాలిటీ షో అనే సంగతి తెలిసిందే. కేప్ టౌన్ లో ఉన్న పోటీదారులంతో తమ తమ సోషల్ మీడియా ద్వారా అభిమానుల్ని పలకరిస్తున్నారు.. మరి కొందరు వీరిని ఆటపట్టిస్తున్నారు. ఇటీవల శ్వేత వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆమె భర్త అభినవ్ కోహ్లీ నుంచి విడిపోయింది. ఎందుకు విడిపోయారు? అసలేం జరిగింది? లాంటి ప్రశ్నలను అభిమానులు సంధించకుండా ఎలా ఉంటారు. ఇంత ప్రేమను వ్యక్తం చేసుకున్న శ్వేత, అనుష్క ఈ రియాలిటీ షోలో ఎలా తలపడతారో చూడాలి.
Must Read ;- స్వీటీ పెళ్ళిసెటిలైందా? నిజమేనా?