ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చిన్న కుమారుడు, నటుడు రాజా ఓ ఇంటివాడయ్యాడు. రాజా అసలు పేరు రాజా భవానీ శంకర శర్మ. అనేక సినిమాల్లో నటుడిగా రాజా సుపరిచితుడే. ఫిదాలో అతను నటించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.
వెంకట లక్ష్మీ హిమబిందుతో హైదరాబాద్ లోని దసపల్లా హోటల్లో అతని వివాహం జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, కృష్ణవంశీ, క్రిష్, గుణ్ణం గంగరాజు, వంశీ పైడపల్లి, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, రచయిత బుర్ర సాయిమాధవ్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
