ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రతిష్టాత్మక సంస్థ ముందుకొచ్చింది. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో ప్రత్యేక గుర్తింపు సాధించిన సిర్మా SGS టెక్నాలజీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాలు ఉన్నాయి.
చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సిర్మా SGS టెక్నాలజీ దేశంలోనే అతిపెద్ద PCB – ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు, CCL – కాపర్ క్లాడ్ లామినేట్ తయారీ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం దాదాపు రూ. 1800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది సిర్మా SGS. 2027 మార్చి నాటికి ఈ ప్లాంట్‌ను రెడీచేసి ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తోంది సిర్మా SGS.
ఇప్పటికే సిర్మా SGS టెక్నాలజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌తో పలుమార్లు చర్చలు జరిపింది. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన ఈ సంస్థను సాదరంగా ఆహ్వానించిన ప్రభుత్వం..పూర్తి సహాయసహకారాలు అందిస్తామని తెలిపింది. సిర్మా SGSకు అవసరమైన భూమి కేటాయించడంతో పాటు వేగంగా అనుమతులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. ఈ ప్లాంట్‌లో తయారు చేయబోయే PCBలను స్మార్ట్ మీటర్స్, మెడికల్ డివైజెస్, ఆటోమోటివ్స్, ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగాల్లో వాడతారు.
ఇండస్ట్రీ సెక్టార్‌లో, పారిశ్రామిక వేత్తలలో చంద్రబాబుకి ప్రత్యేకమయిన బ్రాండ్ ఇమేజ్ ఉంది.. ఇటు, ఆయన తనయుడు, మంత్రి లోకేష్ సైతం స్పెషల్ ఇమేజ్ దక్కించుకుంటున్నారు.. వైజాగ్‌కి ఐటీ కంపెనీలు క్యూలు కడుతున్నాయి.. ఇప్పటికే పదుల కంపెనీలు విశాఖ తీరాన వాలిపోతున్నాయి.. ఇటు, ఆర్సెల్లార్ మిట్టల్ కంపెనీ ఉత్తరాంధ్రలో 85 వేల కోట్ల కంపెనీ స్టీల్ ఫ్యాక్టరీకి రెడీ అవుతోంది.. తాజాగా 2 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్ మెంట్‌తో సిర్మా కంపెనీ ఏపీలో పెట్టుబడికి సిద్ధం అయింది. ఇదే ఇప్పుడు సౌత్ ఇండియాని షేక్ చేస్తోంది..











