ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ వైసీపీ నేతలను వెంటాడుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డితో పాటు పలువురు అధికారులు అరెస్టయ్యారు. లిక్కర్ స్కామ్‌ను సీరియస్‌గా తీసుకున్న సిట్..పక్కా ఆధారాలతో దర్యాప్తు చేస్తోంది. దీంతో విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.
ఐతే ఆసక్తికరంగా తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు పేరు ఏపీ లిక్కర్ స్కామ్‌లో రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. శ్రవణ్‌రావుకు ఇప్పటికే లిక్కర్ స్కామ్ విచారణ జరుపుతున్న సిట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో తెలంగాణకు చెందినవారికి నోటీసులు రావడం ఇదే తొలిసారి.
శ్రవణ్ రావు, వైసీపీకి చెందిన కొంత మంది వ్యక్తులతో కలిసి దుబాయిలోని ఓ ప్రైవేట్ అపార్ట్‌మెంట్ నుంచి ఈ మద్యం కుంభకోణం వ్యవహరం నడిపించారని తెలుస్తోంది. ఈ మేరకు ఈనాడు గత వారం ఓ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది.
ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం…శ్రవణ్‌కు లిక్కర్ స్కామ్ కేసులో సాధారణ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి ఇప్పటికే కస్టడీలో ఉన్నారు. 2019-24 మధ్య ఏపీలో జరిగిన మధ్యం కుంభకోణంకు సంబంధించి అనేక మంది వైసీపీ నేతలకు దుబాయిలో శ్రవణ్ రావు ఆతిథ్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్‌లో చాలా పెద్ద తలకాయలు ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ జరుగుతున్న కొద్దీ ఒక్కొక్కరి పేరు వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేశారు.










