వల్లభనేని వంశీ పాపాలపుట్ట పగలబోతుందా..! అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గడిచిన ఐదేళ్లూ అడ్డూఅదుపు లేకుండా రెచ్చిపోయిన వంశీ అరాచకాలకు మూల్యం చెల్లించుకునే సమయం వచ్చింది. వంశీ అక్రమాలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం…ఉన్నతస్థాయి పోలీసు అధికారులతో ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ – SITను ఏర్పాటు చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వంశీ అక్రమ మైనింగ్ వ్యవహారంతో పాటు భూకబ్జాలు, దోపిడీ, ఇతర ఆర్ధిక నేరాలకు సంబంధించిన వ్యవహారాలను, నేరాలను దర్యాప్తు చేసేలా సిట్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు రేంజ్ ఐజీ GVG అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేస్తూ ఈ ఆదేశాలు జారీ ఇచ్చారు.
15 రోజులకు ఓ సారి నివేదిక –
ఏలూరు ఎస్పీ కె. ప్రతాప శివ కిషోర్, తూర్పు గోదావరి ఎస్పీ డి.నరసింహ కిషోర్లు సభ్యులుగా అలాగే డీజీపీ సూచించిన మరో సభ్యుడ్ని కూడా నియమిస్తూ సిట్ ఏర్పాటు చేసింది. వంశీ అక్రమాలపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సిట్‌ను ఆదేశించింది. CID డీజీ నేతృత్వంలో పర్యవేక్షణలో సిట్ పని చేస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది. వైసీపీ నేత వల్లభనేని వంశీ చేసిన అక్రమాలకు సంబంధించిన వ్యవహారాల్లో BNS- 2023 చట్టం కింద కేసులు నమోదు విచారణ, దర్యాప్తు చేసే అధికారాన్ని సిట్‌కు కల్పిస్తూ ఆదేశాలిచ్చారు. ప్రతీ 15 రోజులకూ సిట్ చేపట్టే దర్యాప్తును డీజీపీకి నివేదించాల్సిందిగా సిట్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
అనుచరులతో కలిసి అక్రమాలు –
వైసీపీ హయాంలో వంశీ అక్రమాలకు అడ్డూ లేకుండా పోయింది. వంశీ అరాచకాల కారణంగా వందలాది మంది బలయ్యారు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో వంశీ తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారని ఇప్పటికే విజిలెన్సు నివేదిక ఇచ్చింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గ్రావెల్ , భవన నిర్మాణాల్లో వినియోగించే కంకర అక్రమంగా మైనింగ్ చేయడంతో పాటు వీటన్నిటికీ ఫైనాన్సింగ్ చేసినట్టుగానూ విజిలెన్సు గుర్తించింది. తన అనుచరుతో ఈ అక్రమ వ్యవహారాలను వంశీ నడిపించినట్టుగా విజిలెన్సు విభాగం తేల్చింది. తద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.195 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు విజిలెన్సు స్ఫష్టం చేసింది. అక్రమ మైనింగ్ కారణంగా పర్యావరణమూ తీవ్రంగా దెబ్బతిందని విజిలెన్సు తన నివేదికలో పేర్కోంది.
అక్రమంగా భూములు
ఇక వంశీ తన అనుచరులతో కలిసి కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేశారని, బెదిరించి, అక్రమ మార్గాల్లో భూములు కాజేశారని విజిలెన్స్ స్పష్టం చేసింది. ఈ భూముల్ని తన బినామీల పేరిట రిజిస్టర్ కూడా చేయించారని గుర్తించింది. పానకాలు చెరువు నుంచి కూడా పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు అక్రమంగా చేశారని స్పష్టం చేసింది. దీంతో దాదాపు రూ.100 కోట్ల వరకు వంశీకి లబ్ధి జరిగిందని నివేదికలో పేర్కొంది. విజిలెన్సు నివేదిక ఆధారంగా సిట్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది.
మరోవైపు తెలుగుదేశం ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్ధన్ కిడ్నాప్, అతనిపై దా*డి కేసులో వంశీకి బిగ్‌షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం..వంశీని మూడు రోజుల కస్టడీకి అప్పగించింది.











