ఒక దార్శినిక ముఖ్యమంత్రి రాష్ట్రానికి లేకుంటే.. తద్వరా గ్రామం.., రాష్ట్రం.., దేశం ఏవిధంగా సర్వనాశనం అవుతోందో.. ప్రస్తుత రాజకీయాల విధానాలను చూస్తే ఇట్టే అర్ధమౌతోంది.
ఏపీలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నాలుగునరేళ్ళుగా అన్నీ రంగాలను కూలదీశాడు. సర్వతోముఖంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రాష్ట్ర విభజన జరిగి.. రాజధాని లేని ఏపీని సర్వోన్నతంగా నిర్మించాలని ఆనాడు తెలుగు దేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కలలు కన్నారు. ఆ కలలను సాకారం చేసే దిశగా యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యం అవసరమని గ్రహించాడు. ఈ నేపధ్యంలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతను సాంకేతిక, యాంత్రీక, మౌళిక రంగాల నైపుణ్యం సాధించే దిశగా తీర్చి.. వారి శిక్షణ ఇవ్వాలని భావించారు. రాష్ట్రంలో మొత్తం 40కి పైగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసి.. యువతకు ఉపాధిని అందించారు.
ఉపాధిలో నైపుణ్య ఉత్పత్తి కేంద్రాలుగా దోహదపడిన స్కిల్ కేంద్రాల ద్వారా ఆనాడు దాదాపు 4 లక్షల మందికి శిక్షణ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. తద్వారా లక్షనరమంది ప్రత్యక్ష్యంగా ఉద్యోగాలు సాధించి.. దేశంలోని పలు రాష్ట్రాలో ఐటీ ఉద్యోగాలను సాధించారు. మరో రెండునర లక్షల మంది చేతివృత్తి నైపుణ్యరంగంలో స్వయం ఉపాదిని పొందుతున్నారు. నైపుణ్య కర్మాగారాలుగా విరాజిల్లుతూ… చదువుతో పాటు యువతను ఉన్నతంగా తీర్చిదిద్దే స్కిల్ కేంద్రాలను నేడు కిల్ చేశారు జగన్ రెడ్డి.
యువతకు పెద్దఎత్తున నైపుణ్య శిక్షణ అందిస్తాం.. ,120 కోర్సుల్లో శిక్షణ , బోధన ఇస్తాం అని ఊదరగొట్టిన జగన్ ఆ సంగతి మరిచిపోయాడు. నైపుణ్య శిక్షణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం.., అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న హామీని తుంగలో తొక్కారు.
కేంద్ర ప్రభుత్వ దీన్ యాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం కింద ఇస్తున్న నిధులను తీసుకుంటూ.., స్కిల్ ను నిల్ చేశాడు జగన్. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాలను సైతం మూసివేసి.. యువతకు నైపుణ్యానికి దూరం చేసిన ఘనత ఆయనకే దక్కుతోంది. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా జగన్ రెడ్డి ఏలుబడిలో యువత స్కిల్ కిల్..ఉపాధి నిల్.. పక్క రాష్ట్రాలకు వలసలు ఫుల్ అన్నమాదిరిగా రాష్ట్రం దిగజారిందన్నది అక్షర సత్యం.