అంతా బాగుంటే పరిపాలన చేయడం ఎవరికైనా ఈజీనే..కానీ ప్రకృతి విరుచుకుపడి, సంక్షోభం అలుముకున్న వేళ అసలైన నాయకుడు ఎవరో ప్రపంచానికి తెలుస్తోంది. ప్రకృతి విపత్తులైనా, ఎలాంటి సవాల్‌నైనా ఛాలెంజ్‌గా తీసుకోవడంలో AP సీఎం చంద్రబాబు రూటే సపరేట్. గతంలో విశాఖను వణికించిన హుదూద్ తుపాను మొదలుకుని, మొన్నటి విజయవాడ వరదల వరకు ఆయన చూపిన తెగువ, నాయకత్వం దేశానికే రోల్ మోడల్‌గా నిలిచాయి. తాజాగా రాష్ట్రాన్ని కుదిపేసిన అర్నాబ్ తుపాను వేళ కూడా చంద్రబాబు తన మార్క్ క్రైసిస్ మేనేజ్మెంట్తో అధికార యంత్రాంగాన్ని రాత్రింబవళ్లు పరుగులు పెట్టించి మరోసారి తన సత్తా ఏంటో చాటిచెప్పారు.
అర్నాబ్ తుపాను తీరం దాటే సమయంలో ఒక్క ప్రాణం కూడా పోకూడదనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ముందుగానే పక్కా వ్యూహం సిద్ధం చేసింది. తుపాను తాకడానికి ముందే తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను విరుచుకుపడిన ఆ రాత్రంతా సీఎం చంద్రబాబు కంటి మీద కునుకు లేకుండా గడిపారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ – RTGS కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి లైవ్ సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ..కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ఏకంగా 32 వేల మంది సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన తీరు ఆయన అంకితభావానికి నిదర్శనం.
ప్రకృతి ప్రకోపానికి ఎక్కడికక్కడ చెట్లు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు నేలకూలడం జరిగిపోయినా..వాటన్నింటినీ గంటల వ్యవధిలోనే క్లియర్ చేయించడం చంద్రబాబు మార్క్ పనితీరుకు అద్దం పడుతోంది. ఈదురు గాలులు తగ్గిన వెంటనే రోడ్లపై అడ్డంగా పడిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని, వెంటనే విద్యుత్ సరఫరాను సరిచేయాలని ఆయన ఇచ్చిన ఆదేశాలు గ్రౌండ్లో పర్ఫెక్ట్గా అమలయ్యాయి. NDRF, SDRF బలగాలను సమన్వయం చేయడంతో పాటు.. బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు అందేలా మంత్రులను రంగంలోకి దించారు. మరోవైపు రైతన్నలకు భరోసా కల్పించేలా తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియను కూడా వేగవంతం చేశారు.
కష్టకాలంలో AC గదుల్లో కూర్చోకుండా, స్వయంగా రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్లను నడిపించే చంద్రబాబు శైలిని ఇప్పుడు జాతీయ స్థాయి మీడియా, అడ్మినిస్ట్రేటివ్ నిపుణులు సైతం కొనియాడుతున్నారు. టెక్నాలజీని, అడ్మినిస్ట్రేషన్‌ను సమర్థవంతంగా మిక్స్ చేసి నష్టాన్ని ఏ విధంగా తగ్గించవచ్చో చంద్రబాబు చేసి చూపిస్తున్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుండి నడిపించే పెద్ద దిక్కులా వ్యవహరిస్తూ, రికార్డు సమయంలో రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చిన చంద్రబాబు..మరోసారి తాను దేశంలోనే అల్టిమేట్ క్రైసిస్ మేనేజర్ అని నిరూపించుకున్నారు











