May 5, 2026 5:37 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

పాట రచయితకు సామాజిక బాధ్యతపై సిరివెన్నెల మాట

సినిమా రచయితకు సామాజిక బాధ్యత ఎంతవరకు ఉండాలి అనే విషయంపై సిరివెన్నెల సీతారామశాస్త్రి ఓ సందర్భంగా స్పందించారు. ఆయన ఏమన్నారో చదవండి.

December 1, 2021 at 4:23 PM
in Cinema, Tollywood
Social Responsibility Of Lyric Writer
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Social Responsibility Of Lyric Writer

పాటల రచయితకు సామాజిక బాధ్యత ఉండాలా? దీనికి సిరివెన్నెల సీతారామశాస్త్రి ఏమన్నారో ఆయన మాటల్లోనే ఓసారి చూద్దాం. సామాజిక బాధ్యత ఒక్క సినిమా రచయితకేనా? అందరికీ ఉండాలి కదా. సామాజిక బాధ్యత లాంటి పెద్ద పదాలు వాడటం వల్ల అలా ఉండటం ఏదో గొప్పతనంగా భావించడం, అసలు ఉండాలా వద్దా అని చర్చోపచర్చలు చేయడం ఎక్కువైపోతోంది. రోడ్డు మీద ఎడమ వైపు వెళ్ళమంటే, ‘కాదు.. కుడి వైపుకే పోతాననడం’ వల్ల ఏమవుతుంది? అయితే, నువ్వు వెళ్ళి డివైడర్‌కి గుద్దుకుని హాస్పటల్లో పడతావు.. లేదంటే, ఎదుటివాడిని గుద్దేసి జైల్లో పడతావు.

ఆస్పత్రికో జైలుకో పోతావు తప్ప తిన్నగా అయితే బతకవు. అందుకే, ఎడమ వైపే వెళ్ళాలి అన్నది ఈ సమాజం చేసిన అతి చిన్న కట్టుబాటు. నిజానికి, దాన్ని పాటించడం నీకే మంచిది. మనం సరిగ్గా నడవకపోతే? పడిపోతాం. మనం తిండి తినకపోతే? రోగం వస్తుంది. ఇదీ అంతే! సమాజంలో ఉండాల్సిన విధంగా ఉండకపోతే? అది మనకే నష్టం. దాని తాలూకు అసౌకర్యం మనమే అనుభవించాల్సి వస్తుంది. అంత సింపుల్ విషయం సామాజిక బాధ్యత అంటే. మనం సింపుల్ విషయాలను బాగా కాంప్లికేట్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాం.

నువ్వు తినే ప్రతి ఒక మెతుకూ ఈ సంఘం పండించిందే. గర్వించే నీ ఈ బతుకు ఈ సమాజం మలిచింది. నువ్వు ఈ భూమి మీద మొదటి ఊపిరి తీసుకున్నాకా, నీ తల్లి నుండి తీసుకున్న మొదటి పాల చుక్క కూడా ఈ సమాజపు సగటు ఉత్పత్తియే. ఎందుకంటే- నీ తల్లి ఈ సమాజంలో పుట్టింది. అందరిలాగానే సమాజం ఉత్పత్తి చేస్తున్న ఆహారం తిన్నది. ఇక్కడే పెరిగి, ఒక సామాజికుడైన నీ తండ్రిని పెళ్ళి చేసుకుని నిన్ను కన్నది. కాబట్టి, నీ తల్లిదండ్రులకు నువ్వు ఎలా అయితే రుణపడి ఉన్నావో, సమాజానికి కూడా అలాగే రుణపడి ఉన్నావు. అందుకే సమాజం పట్ల అందరికీ బాధ్యత ఉండాలనేది.

ఇప్పుడు, సినీ గేయ రచయితకి సామాజిక బాధ్యత అని అడిగారు కాబట్టి ఈ విషయానికి వద్దాం. ఇదీ అన్నిటిలానే ఒక వృత్తి. రాసేటప్పుడు అది ఎందుకు రాస్తున్నామో తెలుసుకుని రాయాలి. డబ్బులు వస్తాయి కరెక్టే. కానీ డబ్బు సంపాదించడానికి ఇదొక్కటే మార్గం కాదు కదా! నా విద్యను నేను ఈ రూపంలో ప్రదర్శిస్తున్నాను అంటే, కవిత్వం రాస్తున్నాను అంటే, కొన్ని కారణాలు ఉంటాయి. ఎవరో ఆస్వాదించాలన్నది – ఒకటి. అంతకన్నా ముఖ్యంగా – నా భావనలతో, అవి చెప్పే నా విధానంతో ఏకీభవించడానికి ఎంతమంది ఉన్నారని వెతుక్కోవడం – మరొకటి. అలా, ఈ రూపంలో నాలాగే ఈ భావాలని కలిగి ఉన్నవారిని వెతుక్కుంటున్నాను.

Social Responsibility Of Lyric Writer

ఈ కవిత్వం బయటకు ఎలా వెళ్తోందీ? సినిమా పాట రూపంలో. ఇక్కడ నేను రాసే అక్షరం ధ్వని ముద్రితమవుతుంది, కోట్లాది మందికి చేరుతుంది. వాళ్ళు ఈ పాట వినడానికి వేర్వేరు కారణాలు ఉండవచ్చు. హీరో కోసమనో, సంగీతం కోసమనో, ఊరికే కాలక్షేపం కోసమనో- ఇంకా రకరకాల ప్రాధాన్యతలు ఉండవచ్చు. వాటన్నిటి మధ్యలో నా అక్షరం బ్రతకగలిగేలా, నా భావాన్ని వినిపించి, ఆ భావాలతో ఏకీభవించగలిగేవారిని వెతికగలిగేలా రాసేంత ఆత్మగౌరవం నాకుండాలి. పాట వినడంలో రకరకాల ప్రేక్షకులకు ఉండే ఏవేవో ఉద్దేశాల మధ్య, వాటన్నిటినీ దాటి, నా మాట వారి చెవిన పడాలనీ, దానికి వారు ప్రతిస్పందించి, తిరిగి నా వరకూ వారి ప్రతిస్పందన వినిపించగలిగేలా చేయాలనీ – అనేటువంటి ఒకానొక ఆత్మగౌరవం ఉండాలి కవికి.

అలాంటి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం సమాజం పట్ల అతనికి ఉండే బాధ్యత. ఒకరు మెచ్చుకుంటారనో, ఒకరు తిడతారనో కాదు – సమాజంలో ఒక వ్యక్తిగా నాకుండే గౌరవాన్ని నా అక్షరం నిలబెట్టేలా ఉండాలి. సామాజిక బాధ్యత అని, అదేదో బరువులా, దూరంగా ఉండే భావనలా ఆలోచించకుండా, ఇది నా స్వంత గర్వం, అభిమానం – వీటిని ఈ వృత్తిలో నేను నిలబెట్టుకోవాలి అని ఆలోచించుకుంటే బాగా పాటించవచ్చు. ఆయన మనసులోని భావాలు ఇలా సాగిపోయాయి. సామాజిక బాధ్యతపై ఇదీ సిరివెన్నెల కవి హృదయం స్పందన.

Must Read ;- పాటల పూదోటలో ‘సిరివెన్నెల’ దేదీప్యమానం

Tags: sirivennelasirivennela seetharama sastry is nomoresirivennela sitarama sastrysirivennela sitarama sastry is no moresirivennela son marriagesocial responsibility of lyric writerspecial story of sirivennela seetarama sastrytollywood lyric writter sirivennela seetharama sastry health bulletin out
Previous Post

ఆచార్య నుంచి అదిరిపోయే అప్ డేట్స్

Next Post

సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు.. చిత్ర పరిశ్రమకు ఊరటేనా?

Related Posts

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Riya Sen Looks Sexy And Seductive In These Throwback Photos

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

అశోక్ ప్రాభవానికి గండికొట్టేలా.. ఏదో జరుగుతోందక్కడ!

గుంటూరు మేయర్ టీడీపీ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర..

మే 27, 28 తేదీల్లో మహానాడు : టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయం

Dimple Hayathi stuns in a sheer top in these new captivating photoshoots

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

గీతదాటిన పోలీసులు సంజాయిషీ చెప్పాల్సిందేనా?

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist