హీరోలు నిర్మాతగా మారడం.. దర్శకులు నిర్మాతగా మారడం.. ప్రొడ్యూసర్ డైరెక్టర్ గా మారడం.. ఇండస్ట్రీలో మామూలే. ఇప్పుడు నాగ్ డైరెక్టర్ కూడా నిర్మాణ రంగంలోకి ఎంటర్ అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. ఎవరా నాగ్ డైరెక్టర్ అంటారా..? కళ్యాణ్ కృష్ణ. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంతో కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యారు. నాగార్జున, రమ్యకృష్ణ జంటగా నటించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సంచలన విజయం సాధించింది. ఈ సినిమా నాగ్ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని సినిమాగా నిలిచింది.
ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ నాగచైతన్యతో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా చేసాడు. ఇందులో నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించిన ఈ సినిమా కూడా కళ్యాణ్ కృష్ణకు మంచి విజయాన్ని అందించింది. ఈ మూవీ తర్వాత నాగార్జునతో బంగార్రాజు చేయాలి అనుకున్నారు. అప్పుడు నాగార్జున వేరే సినిమాల్లో బిజీగా ఉండడంతో.. కళ్యాణ్ కృష్ణ నేల టిక్కెట్ సినిమా చేసారు. రవితేజతో తెరకెక్కించిన నేల టిక్కెట్ ఆశించిన విజయాన్ని అందించలేదు. అప్పటి నుంచి మళ్లీ బంగార్రాజు స్టోరీ పై కళ్యాణ్ కృష్ణ కసరత్తు చేస్తూనే ఉన్నారు.
ఈ నెలలో బంగార్రాజు సెట్స్ పైకి వెళ్లనుందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ నిర్మాణ రంగంలోకి ఎంటర్ అవుతున్నాడని తెలిసింది. ఓటీటీ కోసం ఓ సినిమాని నిర్మిస్తున్నాడట. దర్శకుడు ఎవరంటే..కళ్యాణ్ కృష్ణ ఫ్రెండ్ నవీన్ గాంధీ అని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాని ఎనౌన్స్ చేయనున్నారు. ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందని.. అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ తో రూపొందుతుంది అంటున్నారు. మరి.. దర్శకుడిగా సక్సస్ సాధించిన కళ్యాణ్ కృష్ణ నిర్మాతగా కూడా సక్సస్ సాధిస్తాడేమో చూడాలి.
Must Read ;- బంగార్రాజు ఆలస్యానికి అసలు కారణం ఇదే.. !