జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హైదరాబాద్‌లో ఇవాళ భేటీ అయ్యారు. ముఖ్యంగా ఏపీలో రాజకీయ పరిస్థితులతో పాటు, తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే విషయంపై గంటకుపైగా ఇరువురు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తారని మొదటి నుంచి బీజేపీ చెబుతోంది. ఇవాళ జరిగిన భేటీ తరవాత కూడా తిరుపతిలో ఏ పార్టీ అభ్యర్థి పోటీలో ఉంటారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. అంటే చర్చలు కొలిక్కి వచ్చినట్టు కనిపించడం లేదని తెలుస్తోంది.
అభ్యర్థి ముఖ్యం కాదు
సమావేశం అనంతరం బీజేపీ అధ్యక్షుడు సోము మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో ఏ పార్టీ అభ్యర్థి నిలబడతారనేది ముఖ్యం కాదని, 2024 ఎన్నికల్లో జనసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసినట్టు ఆయన తెలిపారు. అయితే, ఇరు పార్టీల అధినేతలూ తమ అభ్యర్థులను పోటీలో నిలపాలనే గట్టి పట్టుతో ఉండటం వల్లే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం వెలువడలేదని తెలుస్తోంది. తిరుపతిలో బీజేపీ అభ్యర్థిని నిలపాలని సోము గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు జనసేనాని కూడా తమ పార్టీ అభ్యర్థిని తిరుపతి బరిలో నిలపాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
Must Read ;- తిరుపతి ఉపఎన్నికలో ఏసు, శ్రీకృష్ణుడి మధ్యే పోటీ : సునీల్ దేవధర్











