ఇటు క్రేజీ యాంకర్ గానూ, అటు అందాల కథానాయికగానూ మెప్పిస్తోన్న ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్. ఆమె కు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా యూత్.. ఆమె యాంకరింగ్ ను, ఆమె సినిమాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవరు. ఈ నేపథ్యంలో రష్మీ గౌతమ్ అందాలొలికిస్తోన్న తాజా చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. కొంతకాలంగా హీరోగా వెనుకబడిన నందు ఈ సినిమాతో మళ్ళీ టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
ప్రవీణ్ పగడాల నిర్మాణంలో రాజ్ విరాట్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ మూవీ. ఆ మధ్య విడుదలైన రష్మీ ఫస్ట్ లుక్, నందు లుక్ , టీజర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులోని ‘రాయే నువ్ రాయే’ అనే పాట లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. వాణీగా రష్మీ, పోతురాజుగా నందు నటిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. మరి రష్మికీ, నందుకి ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ మూవీ సార్ధక నామధేయం అవుతుందేమో చూడాలి.











