సోనియా గాంధీ.. పుట్టింది ఇటలీలోనైనా, భారతదేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. శతాబ్దం పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి దీర్ఘకాలిక అధ్యక్షురాలిగా వ్యవహరించిన ఘనత ఓ మహిళగా సోనియా సొంతం. పార్టీ అత్యున్నత స్థాయిలో ఉన్నా, నేడు ఒడిదుడుగుల్ని ఎదుర్కొంటున్న మొక్కవోని దీక్ష పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తూ, అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా నేటికీ పార్టీకి పూర్వవైభవం కలిగించాలనే అకుంటిత దీక్షతో పనిచేస్తున్న మహిళా నేత.
ఆకాశమంత ఆత్మస్థైర్యం
భారతదేశం లోని అతికొద్ది మంది మహిళా రాజకీయ వేత్తలలో సోనియాగాంధి పేరు ముందువరసలో ఉంటుందనడంలో సందేహం లేదు. ఇటలీలో పుట్టి, అమెరికాలో పెరిగి, భారతదేశ ప్రధానికి కోడలిగా అడుగుపెట్టి తనదైన మార్క్ రాజకీయంతో పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టింది. ఆనాటి నుండి నేటి వరకు పార్టీ పురోగతైనా, తిరోగతైనా అన్నింటికీ బాధ్యత వహిస్తూ, ఏటికి ఎదురీదుతున్న పార్టీ పగ్గాలను వదలకు తీరం చేర్చడానికి సోనియా ప్రయత్నాన్ని అభినందించవచ్చు.
ప్రస్థానం సాగిందిలా
సోనియా 1946, డిసెంబర్ 9 న ఇటలీ జన్మించారు. 1964 లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువు నిమిత్తం అమెరికాకు తరలివెళ్లారు. 1968 లో హిందూ సంప్రదాయం ప్రకారం రాజీవ్ గాంధీని వివాహామాడి ఇందిరా గాంధి కోడలిగా భారతదేశంలో అడుగుపెట్టింది. రాజీవ్ గాంధీ రాజకీయాల్లో అడుగుపెట్టేంత వరకు సోనియా గాంధీ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. రాజకీయాల్లో అసలు ఏ మాత్రం అనుభవం, ఆసక్తి లేని సోనియా, భర్త మరణాంతరం కూడా దాదాపు 7 సంవత్సరాలు పార్టీ పగ్గాలకు దూరంగానే ఉంది. కానీ, పరిస్థితులు ఆమెను రాజకీయాల వైపు నడిపించాయి.
Must Read ;- కమలదళంలోకి కాంగ్రెస్ నేతలు ఎవరెవరు?
విదేశీ ముద్ర
భారతీయుడిని వివాహాం చేసుకున్నా కూడా ఆమెపై విదేశీ ముద్ర చెరిగిపోలేదు. 1983 లో ఇటలీ పౌరసత్వాన్ని వదులుకున్నా కూడా ఆమెపై పడిన విదేశీ ముద్ర మాత్రం కొనసాగింది. 1999 లో సొంత పార్టీలోని ముగ్గరు సీనియర్ నేతలే ఆమె విదేశీయతపై ప్రశ్నించగా పార్టీ నుంచి వైదొలగడానికి సిద్ధమైంది. చివరికి, పార్టీలోని ముఖ్యమైన నాయకులంతా సోనియాకు మద్దతుగా నిలవడంతో అనతికాలంలోనే పార్టీ అధ్యక్షురాలిగా 1998లో ఎన్నికై, దాదాపు 22 సంవత్సారాలుగా పార్టీ ప్రతి ఒక్క అడుగుకు తానే బాధ్యత వహించింది.
ప్రధాని పదవి తృణప్రాయాం
2004, 2009 ఎన్నికలలో అఖండ విజయాన్ని అందుకున్న సమయంలో సోనియా ప్రధానిగా పదవి చేపడుతోందని ప్రచారం జరిగింది. పార్టీ నుండి సంపూర్ణ మద్దతు ఉన్నా కూడా, తను విదేశీయురాలనే ముద్ర తిరిగి తెరపైకి తెచ్చాయి ప్రతిపక్షాలు. అలాంటి సమయంలో సంపూర్ణ మెజారిటీ ఉన్న సోనియా ప్రధానికి అర్హురాయుండి కూడా పార్టీ వైపు తన వల్ల ఎవరూ వేలెత్తి చూపకూడదనే కారణంతో ఆర్థక తత్వ వేత్త మన్మోహన్ సింగ్ ని ప్రధానిగా చేశారు. కేవలం ఒక్కసారి కాదు, రెండు సార్లు వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారు. భారతదేశ ప్రధాని పదవి సైతం తనకు కేవలం తృణ ప్రాయంగా వదిలేసింది.
కష్టకాలంలో అండగా
ప్రస్తుత పరిస్థితల్లో కాంగ్రెస్ పార్టీ కాస్త ఒడిదుడుగుల్ని ఎదుర్కోంటున్న మాట నిజమే. సొంత పార్టీ నేతలు సైతం క్షేత్ర స్థాయి ప్రక్షాళన కావాలంటూ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో కూడా అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నందుకు సోనియాపై విమర్శులు కూడా వచ్చాయి. కానీ కష్ట సమయంలో అధ్యక్ష పదవి నుండి తొలగి చేతులు దులుపుకోవడం కరెక్ట్ కాదనేది సోనియా ఉద్దేశం అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో పార్టీకి తన అవసరం ఉందని, అన్ని పరిస్థితులను చక్కబెట్టడానికి సోనియా చేస్తున్న ప్రయత్నం అభినందనీయం.
రైతు సంఘాల నిరసన నేపథ్యంలో పుట్టినరోజు వేడుకల్ని జరపద్దంటూ పార్టీ శ్రేణులకు తెలిపింది. రైతులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాల్సిందిగా తెలియజేశారు. దాదాపు 52 ఏళ్ల కిందట భారతదేశంలో అడుగుపెట్టిన సోనియా, ఈ రోజుతో 74 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇలాగే మరింత ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ, మహిళలకు ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం.
Also Read ;- గ్రేటర్‌లో ఇక కాంగ్రెస్ చాప్టర్ క్లోజా? ఉనికి కోసం కాంగ్రెస్ పోరాటం!