కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న వేళ.. కోవిడ్ బాధితులకు అండగా నిలిచి.. ఎప్పటికప్పుడు సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో ముందుంటున్నాడు సోనూసూద్. ఫస్ట్ వేవ్ లో వలస కూలీల్ని తమ స్వస్థలాలకు పంపి.. రియల్ హీరో అనిపించుకున్న ఆయన.. సెకండ్ వేవ్ లోనూ .. కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ సరఫరా చేయడంలోనూ, ఆర్ధికంగా సహాయం చేయడంలోనూ.. శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది సోనూ సూద్ కు అభిమానులుగా మారుతున్నారు.
అలాంటి అభిమానుల్లో ఒకరైన శ్రీకాకుళానికి చెందిన లాల్ ప్రసాద్ దకోజీ సోనూ సూద్ పెన్సిల్ స్కెచ్ ను అద్భుతంగా చిత్రించాడు. సోనూ సేవల్ని వేనోళ్ళపొగుడుతూ వేసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ స్కెచ్ ను శ్రీకాకుళం ఎం.పీ కింజారపు రామ్మోహన్నాయుడు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ఆయన ట్వీట్ కు సోనూ సూద్ స్పందించాడు. ‘లాల్ ప్రసాద్ నైపుణ్యాన్ని షేర్ చేసినందుకు ధన్యవాదాలు. అతడ్ని వ్యక్తిగతంగా కలవాలని చూస్తున్నాను. మనమంతా కలిసి లంచ్ ప్లాన్ చేద్దామని సోనూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం లాల్ ప్రసాద్ చిత్రపటం.. సోషల్ మీడియాలో వైరల్ గామారింది.
Thank you so much sir for sharing Lal Prasad's amazing work. Really looking forward meeting him in person. We all will soon plan a lunch together 🇮🇳 https://t.co/Jtt1NMlmMn
— sonu sood (@SonuSood) May 11, 2021











