సినిమా రంగంలో అంతా తమాషాగానే జరుగుతుంది. నువ్వేమిటో హీరో ఏమిటి? అన్న అమితాబ్ సూపర్ స్టార్ అయ్యారు. నువ్వసలు హీరోయిన్ గా పనికి రావు అని అవమానించిన హేమమాలిని ఒక తరంలో బాలీవుడ్ ను ఏలారు. సోనూ సూద్ విషయంలోనూ అలానే జరిగింది. ఒక ప్రముఖ పత్రిక కవర్ పేజీ మీద ఫొటో రావాలి అంటే అందుకు అర్హత ఉండాలి. స్టార్ డస్ట్ కవర్ పేజీ మీద తన ఫొటో రావడం కోసం సోనూ ఒకప్పుడు ప్రయత్నిస్తే రిజక్ట్ చేశారట. అలాంటిది ఇప్పుడు స్టార్ డస్ట్ కవర్ పేజీని స్టార్ డస్ట్ పబ్లిష్ చేసింది.
ఇప్పుడు ఈ కవర్ పేజీ రాగానే సోనూ పాత విషయాలను గుర్తుచేసుకున్నారు. ఓ సారి తనను ఆడిషన్ చేసి రిజక్ట్ చేసిన మ్యాగజైన్ ఇప్పుడు కవర్ ఫొటోగా ప్రచురించిందంటూ ఆయన ట్వీట్ చేశారు. స్టార్‌డస్ట్ మ్యాగజైన్ కవర్ ఫొటో కోసం పంజాబ్ నుంచి తన ఫొటోలను పంపిస్తే రిజక్ట్ అయ్యాయని గుర్తచేశారు. తన ఫొటోను ఇప్పుడు కవర్ పిక్ గా మార్చినందుకు వారికి థ్యాంక్స్ అంటూ పోస్టు పెట్టారు.
కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజల సేవలో నిమగ్నమైన సోనూ పేరు ప్రతిష్ఠలు అమాంతం పెరిగిపోయాయి. గత ఏడాది నుంచి నిర్విరామంగా ఆయన సేవలు అందిస్తూనే ఉన్నారు. హాస్పిటల్ బెడ్స్ కావాలని, ఆక్సిజన్ కావాలని, మెడిసిన్స్ కావాలని ఫోన్లు, మెసేజ్ ల ద్వారా జనంఅడుగుతూనే ఉన్నారు.. దానికి సోనూ స్పందిస్తూనే ఉన్నారు. ప్రజలకు ఇలా సేవలందించడం అనేది రూ.100 కోట్ల సినిమాకు పని చేయడం కంటే ఎక్కువ సంతోషం కలిగిస్తుందని ఆయన అన్నారు.
గ్రామాలకు డెడ్ బాడీ ప్రిజర్వ్ బ్యాంకులు
సోనూ సేవల్లో ఇప్పడు కొత్త సేవలు కూడా చేరాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మృతదేహాల సంరక్షణ కోసం గ్రామాలకు డెడ్ బాడీ ప్రిజర్వ్ బ్యాంకులలను అందించాలని సోనూ నిర్ణయం తీసుకున్నారు. సంకిరెడ్డిపల్లి, ఆషాపూర్ బోంకూర్, ఓర్వకల్, మద్దెకిర గ్రామాల్లో డెడ్ బాడీ ప్రిజర్వ్ బ్యాంకులు ఏర్పాటు కోసం ఆయా సర్పంచులు సోనూను సంప్రదించారు. చాలా కాలంగా వీరు ఫ్రీజర్వ్ బాక్సులు రాక ఇబ్బందులు పడ్డారు. దాంతో శవాలు కుళ్లిపోయేవి. ఈ రిక్వెస్టులు రావడంతో సోనూ దానికి పూనుకున్నారు. త్వరలోనే వాటిని ఏర్పాటుచేస్తానని మాట ఇచ్చారు. సోనూ తీసుకున్న నిర్ణయాల్లో ఇది కొత్తదిగానే చెప్పాలి. అసలు ఇలాంటి ఆలోచన ఇప్పటిదాకా ఎవరికీ రాలేదు.
Must Read ;- పాన్-ఇండియా లెవెల్లో ఉచితంగా సోనూసూద్ ఆక్సిజన్











