Sonu Sood’s Seven Years Old Young Fan Breaks TV After Seeing His Hero Beaten Up On Screen :
యాక్టర్ సోనూసూద్.. మనదేశంలోనే కాదు, ప్రపంచవాప్యంగా ఈ పేరు తెలియనివారు ఉండరేమో. కరోనా క్లిష్ట సమయంలోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది పేదల ఆకలి తీర్చాడు. ఎంతోమందికి ఆక్సిజన్ సిలిండర్లను అందించి ప్రాణాలు నిలిపాడు. మరి అలాంటి మానవత్వం ఉన్న నటుడుని విలన్ గా ఊహించుకోవడం కష్టమే. సోనూసూద్ కు పెరుగుతున్నఆదరణనుచూసి డైరెక్టర్లు సైతం కొత్త పాత్రలు తయారుచేస్తున్నారు. ప్రాధాన్యం ఉన్నపాత్రలు ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు. మరి అలాంటి నటుడికి అభిమానులు సర్వసాధారణమే. సోనూ మానవత్వానికి పిల్లలు కూడా ఫిదా అవుతున్నారు. ఆయనను విలన్ గా చూసేందుకు ఇష్టం చూపడం లేదు.
అభిమానంతో టీవీ పగులకొట్టాడు
సినీ నటుడు సోనూసూద్‌పై అభిమానం పెంచుకున్న ఏడేళ్ల ఓ బుడ్డోడు టీవీ పగులగొట్టాడు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. విరాట్ అనే బాలుడు టీవీలో దూకుడు సినిమా చూస్తున్నాడు. అందులో విలన్‌గా నటించిన సోనుసూద్ ను హీరో మహేశ్ కొట్టే సీన్ ఉంటుంది. మహేశ్ సోనూసూద్ ను కొడుతుండటంతో విరాట్‌కు ఎక్కడాలేని కోపం వచ్చింది. మా సోనూసూద్ అంకుల్ని కొడతావా.. అంటూ బయటి నుంచి రాయి తెచ్చి టీవీని పగులగొట్టాడు. దీంతో తల్లిదండ్రులు షాకయ్యారు. సోనూసూద్ అంకుల్ ని కొడితే ఊరుకూనేది లేదంటూ వార్నింగ్ సైతం ఇచ్చాడు.
సోషల్ మీడియాలో వైరల్
ఏడేళ్ల పిల్లగాడు సోనుసూద్ పై అభిమానంతో టీవీ పగులకొట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై సోనూసూద్ ఎలా స్పందిస్తారోనని చర్చించుకుంటున్నారు. కరోనా సమయంలోనూ సాయం పొందిన ఎంతో మంది సోనూసూద్‌ని.. తమ దైవంగా భావిస్తూ.. ఆరాధిస్తున్నారు. కొంతమంది తమ పిల్లలకు సోనూసూద్ పేరు పెట్టుకోగా, మరికొందరు పలు వ్యాపార కంపెనీలకు సోనూ పేరు పెట్టుకోవడం విశేషం.
Must Read ;- సోనూసూద్.. మరో మంచి నిర్ణయం ఫ్రీ ఎడ్యుకేషన్