ప్రముఖ బెంగాలీ నటుడు, దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే విజేత సౌమిత్రా ఛటర్జీని (85) కన్నుమూశారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు శుక్రవారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచారు. వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. కోల్‌కతాలోని బెల్లెవ్ నర్సింగ్ హోంలో ఆయన చికిత్స పొందుతున్నారు.
ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో అభియాన్ అనే సినిమా షూటింగ్ జరుగుతోంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చిన తర్వాత దీని షూటింగును పూర్తిచేశారు. ఈ షూటింగు సమయంలోనే ఆయనకు కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు.
గత ఏడాది కూడా ఆయన న్యుమోనియా వ్యాధితో బాధపడ్డారు. బెంగాలీవాసులకు ఆయన ఆరాధ్య నటుడు. ఉత్తమ నటుడిగా అనేక సార్లు అవార్డులు అందుకున్నారు. బెంగాల్ తొలి తరంవారు ఆయనను ఎంతో అభిమానిస్తారు. మొత్తం మూడు జాతీయ అవార్డులను కూడా అందుకున్నారు. ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే సినిమాల్లో ఆయన నటించారు. 2004లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.2012లో దాదాసాహెబ్ పురస్కారం లభించింది. సంగీత నాటక అవార్డును కూడా ఛటర్జీ అందుకున్నారు. అనేక రచనలు కూడా ఆయన చేశారు.
నెల రోజులుగా ఆస్పత్రిలోనే..
ఛటర్జీకి కరోనా సోకడంతో అక్టోబరు 6వ తేదీన కోల్ కతా లోని బెల్లేవ్ నర్సింగ్ హోమ్ లో చేర్పించారు. దాదాపు నెల రోజులుగా ఆయనకు చికిత్స జరుగుతోంది. కరోనా నెగిటివ్ వచ్చాక నాన్-కోవిడ్ ఇంటెన్సివ్ ట్రామా యూనిట్ (ఐటియు) కు తరలించారు. అప్పటి నుంచి ప్రత్యేక వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 12-15 గంటలకు సౌమిత్రా చటోపాధ్యాయ తుది శ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు అధికారిక ప్రకటన చేశాయి. ఓ మహానటుడిని కోల్పోయి బెంగాలీ సినిమా రంగం అనాథగా మిగిలిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సంతాపాన్ని ప్రకటించారు.
AlsoRead ;-కేసీఆర్, మమత.. ఇదే బాటలో నడుస్తారా?