Sourav Ganguly Confirms His Biopic And It Will Be In Hindi, Ranbir Kapoor Top Choice For DADA Role :
సౌరవ్ గంగూలీ.. తన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. కెప్టెన్ గా భారత్ కు తిరుగులేని విజయాలను అందించాడు. గంగూలీ రాక ముందు.. విదేశాల్లో భారత్ ఆట తీరు ఘోరంగా ఉండేది. స్వదేశంలో పులిలా విరుచుకుపడే భారత జట్టు.. విదేశాలకు వెళ్తే మాత్రం పిల్లిలా మారేది. కానీ గంగూలీ రాకతో భారత్ కొత్త విజయాలను అందుకుంది. ఆయన సారధ్యంలో ఎన్నో విజయాలను అందుకుంది. ముఖ్యంగా 19 ఏళ్ల క్రితం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నాట్వెస్ట్ సిరీస్ చాలామందికి గుర్తుంటుంది. ఎంతో రసవత్తరంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులతోపాటు గంగూలీకి కూడా ఎంతో సంతోషాన్ని అందించింది. విజయంతో ఉప్పొంగిపోయిన దాదా లార్డ్స్ స్టేడియంలో చొక్కా విప్పి తన ఆనందాన్ని ప్రదర్శించాడు. తన కెప్టెన్సీలో ఎంతోమంది యువ ఆటగాళ్లను భారత్ కు అందించి క్రికెట్ పై తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
250 కోట్ల వ్యయంతో
గంగూలీ జీవితం ఆధారంగా హిందీలో ఓ సినిమా రానుంది. దాదాపు 250 కోట్ల వ్యయంతో తెరకెక్కనుంది. ప్రస్తుతం సినిమా వర్క్ నడుస్తోంది. దర్శకుడు ఎవరుఅనేది ఖరారు కాలేదు. గంగూలీ క్రీడా జీవితం ఎలా మొదలైంది? కెప్టెన్ గా సాధించిన విజయాలు? హీరోయిన్ నగ్మాతో నడిపిన లవ్ సోర్టీ అంశాలను టచ్ చేస్తూ బయోపిక్ రానుంది. ఈ విషయమై గంగూలీ స్పందిస్తూ.. తన బయోపిక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని, త్వరలోనే రానుందని తెలిపారు. తన పాత్రను రణ్ బీర్ కపూర్ ప్లే చేస్తే బాగుంటది అని తన మనసులో మాట బయటపెట్టారు.
Must Read ;- గంగూలీ, నగ్మాల ప్రేమ వెనక ఏంజరిగింది?