టాలీవుడ్ లీడింగ్ హీరోయిన్ గా అందాల చందమామ స్థానం చెక్కు చెదరలేదు. పెళ్ళి చేసుకొని వైవాహిక జీవితాన్ని ఆనందంగా లీడ్ చేస్తున్నప్పటికీ..ఆమె సినిమాల లైనప్ మాత్రం ఎప్పటిలాగానే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్య లో కథానాయికగా నటిస్తోన్న అమ్మడు.. కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ లోనూ ప్రధాన పాత్ర పోషిస్తోంది. అలాగే.. నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబో మూవీ లో సైతం కథానాయికగా నటిస్తోంది. వీటితో పాటు అమ్మడు త్వరలో ఓ లేడీ ఓరియెంటెడ్ బాలీవుడ్ చిత్రానికి కమిట్ అయింది. సినిమా పేరు ఉమ.
ఈ విషయాన్ని తరణ్ ఆదర్శ్ .. ట్విట్టర్ లో అధికారికంగా తెలిపాడు. అలాగే కాజల్ సైతం ఉమ గా జెర్నీ మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. మిరాజ్ గ్రూప్ ఈ సినిమాను నిర్మించనుంది. తథాగత సింఘా దర్శకత్వంలో సినిమా రూపొందనుంది. త్వరలోనే ఈ సినిమా కి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడనున్నాయి.
ఎ స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిల్మ్ గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఈ సినిమాతో కాజల్ కెరీర్ అనూహ్యమైన మలుపు తీసుకుంటుంది అని చెబుతున్నారు. ఆల్రెడీ కాజల్ బాలీవుడ్ లో రెండు మూడు సినిమాలు చేసింది. అమ్మడి పెర్ఫార్మెన్స్ టాలెంట్ ఏంటో కూడా బాలీవుడ్ జనానికి తెలుసు. మరి ఉమా గా కాజల్ ఏ తరహా కథతో వస్తుందో చూడాలి.
Must Read ;- హారర్ థ్రిల్లర్ తో భయపెట్టనున్న చందమామ
FILM ANNOUNCEMENT: KAJAL AGGARWAL IN & AS #UMA… #KajalAggarwal will head the cast of #Uma… A slice of life film… Directed by ad filmmaker Tathagata Singha… Produced by Avishek Ghosh and Mantraraj Paliwal [#Miraj Group]… Remaining cast will be announced later. pic.twitter.com/E62o2B8KOM
— taran adarsh (@taran_adarsh) June 4, 2021