ఎనిమిదేళ్ళ క్రితం.. సౌత్ ఇండస్ట్రీలో కథానాయికగా కెరీర్ మొదలు పెట్టింది మల్లూ బ్యూటీ మాళవికా మోహనన్. తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో సైతం తనేంటో నిరూపించుకుంది. లేటెస్ట్ గా విజయ్ సరసన ‘మాస్టర్’ మూవీలో నటించిన మాళవిక.. ఆ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఓ తమిళ్, ఓ హిందీ సినిమాలకు కమిట్ అయింది.
కెరీర్ బిగినింగ్ నుంచి బోల్డ్ పాత్రలు చేయడంలో ఏమాత్రం వెనుకాడని స్వభావం మాళవికది. ఇటు స్కిన్ షో, అటు పెర్ఫార్మెన్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకొని.. సౌత్ అండ్ నార్త్ లో కథానాయికగా సత్తా చాటుకుంది. దీనికి తోడు సోషల్ మీడియాలో తరచుగా తన హాట్ ఫోటోస్ ను షేర్ చేస్తూ.. ఫాలోవర్స్ ను కూడా ఓ రేంజ్ లో పెంచుకుంది. కుర్రకారును కవ్విస్తోన్న ఆమె నాజూకు అందాలు వైరల్ గా మారుతున్నాయి.
అయితే ఇంత బోల్డ్ బ్యూటీగా రాణిస్తున్నప్పటికీ.. మాళవికా మోహనన్ కు .. అదిరిపోయే రేంజ్ లో అవకాశాలు మాత్రం రావడం లేదు. అసలు ‘మాస్టర్’ లాంటి మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నందుకు ఆమెకి ఈ పాటికి ఓ రేంజ్ లో అవకాశాలు వచ్చిపడిపోవాలి. అయితే అటు కోలీవుడ్ నుంచి కానీ, ఇటు టాలీవుడ్ నుంచి కానీ.. మాళవికా మోహనన్ ఎలాంటి అవకాశాలు అందుకోకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈ కరోనా హడావిడి తగ్గాకా అయినా.. అవకాశాలొస్తాయేమో చూడాలి.
Must Read టాప్ లెస్ బ్యాక్ తో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉల్లాల్