స్టార్ డాటర్ ఇన్ లా సమంతా అక్కినేని గురించి ఇప్పుడు ఇండియా వైడ్ గా చర్చించుకుంటున్నారు. కారణం ఆమె తొలి సారిగా డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ఎంట్రీ ఇచ్చింది. ‘ఫ్యామిలీమ్యాన్’ తొలి సీజన్ ను నెత్తిన పెట్టుకున్న ప్రేక్షకులు ఇప్పుడు రెండో సీజన్ గురించి తెగ ఆత్రుతగా ఉన్నారు. అందులో సమంతా అక్కినేని ఎవరూ ఊహంచని ఒక అరుదైన పాత్రను పోషిస్తోంది. మనోజ్ బాజ్ పాయ్ , ప్రియామణి తారగణంతో రూపొందుతోన్న ఈ వెబ్ సిరీస్ అతి త్వరలోనే స్ట్రీమ్ కాబోతోంది.
ఆల్రెడీ ‘ఈగ’ హిందీ వెర్షన్ ‘మఖ్ఖీ’ తో సమంత టాలెంట్ ఏలాంటిదో చవిచూసిన బాలీవుడ్ జనం.. ఇప్పుడు ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ లో ఆమె పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తితో ఉన్నారు. ఇటీవల విడుదలైన ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ లో సమంతా పాత్ర ఏంటనేది రివీలవడంతో.. మరింత ఆత్రుతగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలోని ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో .. మీరు .. మనోజ్ బాజ్ పాయ్ కాకుండా.. ఇంకా ఏ బాలీవుడ్ హీరోతో రొమాన్స్ చేయాలని కోరు కుంటున్నారు అని సమంతాను అడిగగా.. ఠక్కున రణబీర్ కపూరని చెప్పి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ అరుదైన టాలెంటెడ్ హీరో అతడిని ప్రశంసల్లో ముంచెత్తింది. ప్రస్తుతం సౌత్ లో ఓ రేంజ్ లో సినిమాలు చేసేస్తోన్న సమంతా అక్కినేని త్వరలోనే బాలీవుడ్ లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అప్పుడు ఆమెకి రణబీర్ కపూర్ తో నటించే ఛాన్సొస్తే వదిలిపెట్టదేమో అని చర్చించుకుంటున్నారు జనం. అదీ చూద్దాం.











