చిత్రపరిశ్రమలో ఉన్న క్రేజ్ ను .. పొజీషన్ ను వదులుకుని వెళితే ఆ ప్లేస్ దొరకడం దాదాపు దుర్లభమే. అంటే .. ఏకంగా ఇంటికి వెళ్లిపోవడమే. కానీ శ్రుతి హాసన్ మాత్రం ఇంటికి వెళ్లే ఆలోచన చేయలేదు. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్టుగా టాలీవుడ్ కి తిరిగి వచ్చేసింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు గనుక, ముందుగా దీపం వెలిగించేసింది.
అందమనేది అరిగిపోతున్నట్టుగా అనిపించదు .. కరిగిపోతున్నట్టుగా కనిపించదు. కానీ ఈ లోగా అది చేసే లీలా విశేషాలు అన్నీ ఇన్నీ కావు. అందగత్తెలు ఒకచోట కుదురుగా ఉండరు .. ఉండనీయరు. సోషల్ మీడియాలో మత్తు చూపులనో .. మంత్రించే నవ్వులనో వదులుతారు. అప్పటి నుంచి అబ్బాయిలు ఇళ్లు .. ఆఫీసుల అడ్రెస్ లు మరిచిపోయిఫ్లైఓవర్ల చుట్టూ తిరుగుతుంటారు. తాజాగా శ్రుతి హాసన్ వదిలిన ఫొటో చూసిన యువకుల పరిస్థితి అదే. వీళ్లకి అడ్రెస్ చెప్పి ఎక్కడి వాళ్లను అక్కడికి పంపించే బాధ్యత మిగతా అభిమానులు తీసుకోవలసిందే.
తాజాగా శ్రుతి హాసన్ వదిలిన ఫొటోలో ఆమె మినీ బ్లాక్ ఫ్రాక్ లో నేరేడుపండులా .. నల్లద్రాక్ష పండులా మెరిసిపోతోంది. ఇంత నిండుగా ఒళ్లు కప్పుకోవడం నా వల్ల కాదు అన్నట్టుగా ఆమె ఓ లుక్ కూడా విసురుతోంది చూశారా. ఆ కళ్లలో అలక .. కోపం కొట్టొచ్చినట్టు కనిపించడం లేదూ. అమ్మాయిలు అలిగితే అందంగా ఉంటారని ఎవరన్నారోగానీ, అప్పటి నుంచి వాళ్లు అలగడమే పనిగా పెట్టుకున్నారు. మనసు పారేసుకున్న మగరాయుళ్ల సగం సమయం వాళ్లను బుజ్జగించడంతో .. నచ్చజెప్పడంతో గడిచిపోవలసిందే.
Must Read ;- శ్రుతి హాసన్ ఇకపై ‘వెబ్’దరహాసం కూడా