తెలుగు తెరపై ఇలియానా అందాల హోరు .. జోరు ఒక రేంజ్ లో సాగింది. ఇలియానాను చూసినవాళ్లు నడుము ఇంత అందంగా ఉంటుందా? అని ఆశ్చర్యపోయారు. ఉంగారాన్ని వడ్డాణంగా పెట్టుకుంటుందేమోననే విస్మయానికి లోనయ్యారు. అంతగా తన సోయగాలతో మురిపించేసింది. ఇలియానా బికినీ బిగించిందంటే చెరువులు కూడా బీచ్ లు గా కనిపించేవి .. ఆమె తన సొగసుల సంకెళ్లను తెంచేస్తేచాలు, పిల్ల కాలువలు సెలయేళ్ల మాదిరిగా దూకుతూ ప్రవహించేవి. ఈ గోవా బ్యూటీ అంతటి మహత్తు చూపించేసింది. అందం గమ్మత్తులు చేయగలదని నిరూపించింది.

కొంతకాలం నుంచి ఇలియానా సోషల్ మీడియాలో తన స్పీడ్ చూపుతోంది. తాను చాలా గ్లామరస్ గా ఉన్నాననీ .. ఫిట్ నెస్ ఎంత మాత్రం తగ్గలేదనే సంకేతాలను పంపుతూ యూత్ హృదయాలతో కనెక్టివిటీ తెగకుండా చూసుకుంటోంది. ఈ కారణంగానే ఆమె బికినీతో ఉన్న ఫొటోలు .. యోగా చేస్తున్నప్పటి ఫొటోలు .. జిమ్ లో కసరత్తు చేస్తున్నప్పటి ఫొటోలను వరుసగా పోస్ట్ చేస్తోంది. అలా తనని ఎవరూ మరిచిపోకుండా మాయచేస్తోంది. తాజాగా తన అందాలన్నింటినీ కవర్ చేస్తూ ఇలియానా పెట్టిన భంగిమను ఈ ఏడాదిలో మరిచిపోవడం కష్టమే.

సాధారణంగా మన్మథుడు పంచబాణాలను వదిలితేనేగానీ, మనసులో ఎలాంటి కోరికలు కలగవని అంటూ ఉంటారు. కానీ ఇలియానా విషయంలో మన్మథుడితో పనిలేదనీ .. ఆయన ప్రమేయమే అవసరం లేదనే అభిప్రాయంలో కుర్రాళ్లు ఉన్నారు. వాళ్ల అభిప్రాయాలను కొట్టిపారేస్తే .. నెట్టిపారేస్తారు అందుకే ఒప్పుకున్నట్టు ఒక ఎక్స్ ప్రెషన్ ఇవ్వడమే. అడపా దడపా హిందీ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్న ఇలియానాకి, ఈ హాట్ ఫొటోల వలన అదనంగా ఏమైనా కలిసొస్తాయేమో చూడాలి.
Must Read ;- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున పోతపోసిన అందాలు











