అందాల తార నయనతార – డైరెక్టర్ విఘ్నేష్ ప్రేమలో ఉండడం.. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని వార్తలు రావడం తెలిసిందే. ఈ ప్రేమపక్షులు కరోనా టైమ్ లో కూడా కలిసే ఉన్నారు కానీ.. ఇప్పుడు మాత్రం దూరంగా ఉంటున్నారట. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. విషయం ఏంటంటే… నయన్, విఘ్నేష్ ఇద్దరూ హైదరాబాద్ లోనే ఉన్నారట. ఒకే చోట ఉండి కూడా దూరంగా ఉండడం ఏంటి..? ఈ వార్త తెలిసినప్పటి నుంచి ఎందుకు దూరంగా ఉంటున్నారు.? అసలు ఏమైంది అని ఆరా తీస్తున్నారు.
ఇంతకీ మేటర్ ఏంటంటే… నయనతార.. రజనీకాంత్ తో అన్నాత్త అనే సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్ లో షూటింగ్ చేస్తున్నారు. ఈ షూటింగ్ లో రజనీకాంత్ నయనతారతో పాటు సీనియర్ హీరోయిన్ కుష్బూ, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్ పాల్గొంటున్నారు. ఇక నయనతార ప్రియుడు డైరెక్టర్ విఘ్నేష్ ‘కాదు వాకుల రెండు కదల్’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి, నయనతార, సమంత తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమా కూడా హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటుంది. అయితే.. రజనీకాంత్ సినిమా షూటింగ్ లోకేషన్ లోకి బయట వాళ్లని ఎవర్నీ లోపలికి అనుమతించడం లేదట. కరోనా కారణంగా చాలా జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేస్తున్నారట. సెట్ లోకి కొత్త వాళ్లు వస్తే.. కరోనా వచ్చే అవకాశం ఉందని.. దీని వలన షూటింగ్ ఆపేయాల్సి వస్తుందని ఎవర్నీ రానివ్వడం లేదట. అందువలనే ప్రేమపక్షులు విఘ్నేష్ – నయన్ ఒకే చోట ఉన్నా దూరంగా ఉండాల్సి వస్తుందని తెలిసింది. అదీ.. సంగతి..
Must Read ;- పెళ్లి విషయంలో నయనతార కండిషన్ ఏంటి?