సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ మధ్య గాఢమైన ప్రేమ బంధం ఉన్న విషయం మనకు తెలిసిందే. తమిళ హీరో శింబు, డాన్స్ మాస్టర్, నటుడు అయిన ప్రభుదేవాతో బ్రేక్ అప్ తర్వాత నయనతార.. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఈమధ్యనే ఈ జంట క్రిస్మస్ హాలిడే ట్రిప్ కు వెళ్ళారు. అక్కడ దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.

అలాగే కొత్త సంవత్సర వేడుకలను కూడా వీరిద్దరూ ఘనంగా జరుపుకున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా విఘ్నేష్ శివన్ అదిరిపోయే ఒక ఫోటోను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఆ ఫోటోలలో నయనతార నలుపు, నీలి రంగు కలగలిసి మోకాలి వరకు ఉన్న దుస్తులతో కనిపించింది. అలాగే గోల్డ్ కలర్ వాచ్, తెలుపు రంగు బూట్లు ధరించారు. ఇక విఘ్నేష్ శివన్ కూడా నావి బ్లూ షర్ట్ దానికి తగ్గ బూడిద రంగు ప్యాంటు, నలుపు రంగు బూట్లు ధరించి సింపుల్ గా ఉన్నాడు. వీరిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నట్లు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
ఈ ఫొటోతో పాటు న్యూ ఇయర్ విషెస్ ను కూడా పోస్ట్ చేశాడు విఘ్నేష్. ‘ప్రియమైన ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం జీవితంలో చాలా గుర్తుండిపోయే, మరపురాని దశను దాటిపోయాము. మీ అందరికి ఉత్తమమైన క్షణాలు, విజయం, ఆనందం, మంచి ఆరోగ్యం, శాంతి ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను. అందరికి 2021 చిరస్మరణీయంగా గుర్తుండిపోవాలి’ అని పోస్ట్ చేశారు. విఘ్నేష్, నయనతార అభిమానులు, నెటిజన్లు వారికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2021లోనైనా వీరి వివాహం జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. అభిమానులతో పాటుగా కోలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఈ జంటకు న్యూ ఇయర్ విషెస్ చెపుతున్నారు.










