లోకనాయకుడు కమల్ హాసన్ – క్రియేటివ్ జీనియస్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన సంచలన చిత్రం ‘భారతీయుడు’. అవినీతిని అరికట్టడం నేపధ్యం అనగానే ఠక్కున గుర్తుకువచ్చేది భారతీయుడు. అంతలా ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. అయితే.. ఈ సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 ఆమధ్య స్టార్ట్ చేశారు. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మూవీని చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. అయితే.. ఏముహుర్తాన ఈ మూవీని ప్రారంభించారో కానీ.. అడుగడుగునా అడ్డంకులు వస్తూనే ఉన్నాయి.

చాలా సార్లు ఈ సినిమా స్టార్ట్ కావడం.. ఆతర్వాత ఆగిపోవడం జరిగింది. ఆమధ్య క్రేన్ యాక్సిడెంట్ వలన ఈ మూవీకి వర్క్ చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ చనిపోవడం కూడా జరిగింది. దీని తర్వాత భారతీయుడు 2 గురించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. నిర్మాత ఈ సినిమా పై ఇంట్రస్ట్ చూపించడం లేదని.. శంకర్ ఈ ప్రాజెక్ట్ ను వదిలేసి మరో సినిమా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. శంకర్ సౌత్ లో ఉన్న స్టార్ హీరోలతో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపించింది. అయితే.. ఇప్పుడు మరోసారి భారతీయుడు 2 వార్తల్లోకి వచ్చింది.
విషయం ఏంటంటే.. భారతీయుడు నిర్మాత, దర్శడు మధ్య వచ్చిన గొడవలు సద్దుమణిగాయట. తిరిగి భారతీయుడు 2 స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అనుకున్న బడ్జెట్ లో సినిమా తీస్తానని శంకర్ నిర్మాతకు మాట ఇచ్చారట. దీంతో త్వరలోనే ‘భారతీయుడు 2’ సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే.. మళ్లీ ‘భారతీయుడు 2’ సెట్స్ పైకి తీసుకురావడానికి ప్రధాన కారణం కమల్ హాసన్ అంటున్నారు. ఎందుకంటే.. తమిళనాడులో వచ్చే సంవత్సరంలో ఎన్నికలు రానున్నాయి. అందుచేత ఆ ఎన్నికల్లో కమల్ హాసన్ కి ప్లస్ అయ్యేలా ‘భారతీయుడు 2’ ప్లాన్ చేస్తున్నారట. మరి.. ఈసారైనా ఎలాంటి అడ్డంకులు లేకుండా ‘భారతీయుడు 2’ పూర్తవుతుందని ఆశిద్దాం.
Must Read ;- విలక్షణ నటనకు విశ్వరూపం కమల్ హాసన్