చిరంజీవి సినిమా అంటే బడ్జెట్ మొదలు కథాకథనాల నుంచి ఇతర తారాగణం అంతా కూడా ఆయన రేంజ్ కి తగినట్టుగా ఉండవలసిందే. భారీతనమనేది ప్రధాన లక్షణంగా కనిపించవలసిందే. ఆయన సినిమా ఒకటి సెట్స్ పై ఉండగానే ఆ తరువాత చేయనున్న ప్రాజెక్టులపై అంతా ఆసక్తిని చూపుతుంటారు .. ఉత్సాహంగా చర్చించుకుంటూ ఉంటారు. అందుకు కారణం ఆయనకి గల క్రేజ్ అని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అయితే ఆయన రీమేక్ మూవీలకు సంబంధించి వస్తున్న వార్తలే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
మొదటి నుంచి కూడా చిరంజీవికి హడావిడిపడిపోయే అలవాటు లేదు. ఒక కథ విషయంలో పూర్తిస్థాయి కసరత్తు జరగనిదే ఆయన ఎంతమాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు. ‘ఆచార్య‘ విషయంలోనూ ఆయన అదే పద్ధతిని ఫాలో అయ్యారు. ఇతర భాషలకి చెందిన కథలను రీమేక్ చేయాలనుకున్నప్పుడు కూడా ఆయన అదే విధమైన జాగ్రత్తలు తీసుకుంటారు. తెలుగు నేటివిటీకి సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న తరువాతనే రంగంలోకి దిగుతారు. అవసరమైతే సీనియర్ రైటర్స్ దగ్గరికి ఆ కథలను పంపించి .. అవసరమైన మార్పులు .. చేర్పులు చేయిస్తారు. ఇక తను చేయాలనుకున్న జోనర్ ను బట్టి ఆ ప్రాజెక్టును ఏ దర్శకుడికి అప్పగిస్తే న్యాయం జరుగుతుందనే విషయంలోనూ ఆయన ఆచితూచి అడుగేస్తారు.
Must Read ;- ఆచార్య సెట్ లో షాక్ ఇచ్చిన సోను. ఇంతకీ.. ఏం చేశాడు.?
అలాంటి చిరంజీవికి సంబంధించి ‘లూసిఫర్‘ .. ‘వేదాళం’ రీమేక్ ల విషయంలో చకచకా నిర్ణయాలు జరిగిపోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ‘లూసిఫర్’ రీమేక్ మూవీకి దర్శకుడు ‘మోహన్ రాజా’ అని ప్రకటించారు. అంతవరకు బాగానే ఉంది .. కానీ ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రను ‘నయనతార‘ చేయనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ గా చేయడానికే డేట్స్ లేవని చెప్పే నయనతార సిస్టర్ క్యారెక్టర్ చేస్తుందా అనేది సందేహమే. ఒకవేళ ఈ వార్త నిజమే అయినా, అన్నాచెల్లెళ్లుగా వాళ్లను తెరపై చూడటమనేది అభిమానులకు కాస్త ఇబ్బందిని కలిగించే విషయమేనని చెప్పాలి.
ఇక ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ కి సంబంధించి ఒక క్లియర్ పిక్చర్ రాకమునుపే, ‘వేదాళం’ రీమేక్ అంటూ మరోవైపు నుంచి హడావిడి మొదలైంది. ఆ సినిమాలో చిరంజీవి సిస్టర్ క్యారెక్టర్ ‘కీర్తి సురేశ్‘ చేయనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. చిరంజీవి చెల్లెలి పాత్రకి తగిన వయసు ఆమెకి ఉన్నప్పటికీ, ఆ పాత్రను చేసే పరిస్థితిలో ఆమె లేదనే చెప్పాలి. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా దూసుకుపోతున్న ఆమె అందుకు అంగీకరించకపోవచ్చు. చెల్లెలి పాత్రలు చేయకూడదని కాదు, ఇకపై అదే తరహా పాత్రలు వస్తాయనే ఒక భయం ఉండటం వలన స్టార్ హీరోయిన్స్ అలాంటి పాత్రలను అంగీకరించే సాహసం చేయరు. అందువలన జోరుగా జరుగుతున్న ఈ ప్రచారంలో వాస్తవం పాళ్లు చాలా తక్కువనే అనుకోవలసి ఉంటుంది.
Also Read ;- వేదాళం రీమేక్.. చిరుకు షాకింగ్ రెమ్యూనరేషన్..!