గానగంధర్వుడు బాలు ఆరోగ్యం గురించి ఆందోళన చెందేవారికి ఇది శుభవార్తే. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందన్నది ఆయన కుమారుడు చరణ్ బాలు ఆరోగ్య పరిస్థితిని తెలుపుతూ ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఎస్.పి. బాలు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నప్పటి నుంచి ప్రతి రోజూ ఆరోగ్యపరిస్థితిని చెబుతూ.. ఎస్.పి. చరణ్ వీడియోను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తన తండ్రి కోలుకుంటున్నారని, డాక్టర్స్‌కు, వైద్యానికి స్పందిస్తున్నారని తెలిపారు.
ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ఎందరో కోరుకుంటున్నారు. ‘ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్య పరిస్థితి నార్మల్‌గా ఉంది. 90 శాతం ఐసోలేషన్ నుంచి బయటికి వచ్చేశారు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు. డాక్టర్స్‌కు, వైద్యానికి స్పందిస్తున్నారు. నాన్నగారి కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఎంజీఎం హెల్త్ సెంటర్ వారికి కూడా ధన్యవాదాలు. అలాగే నాన్నగారి కోసం ఎంతో శ్రమించిన, శ్రమిస్తున్న డాక్టర్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు…’ అని చరణ్ వీడియోలో పేర్కొన్నారు.