రాజకీయం అంటేనే అవకాశవాదం, పేరు ప్రతిష్టలు, ఇతర పార్టీలకు కప్పగంతులు, ధనార్జనే ధ్యేయంగా పావులు కదుపుతుంటారు. ఏళ్లుకే ఏళ్లు ఒకేపార్టీలో కూడా ఉండటం చాలా అరదు. భ్రష్టు పట్టిపోతున్న నేటి రాజకీయాల్లో మచ్చలేని మనుషులు ఎవరైనా ఉన్నారా అంటే.. ఇదిగో ‘బక్కని నర్సింహులు’ను ఉదాహరణగా చూపించవచ్చు. ఓ సామాన్య కార్యకర్తగా ఎంట్రీ ఇచ్చిన బక్కని టీటీడీపీ అధ్యక్షుడి వరకు ఎదిగిన తీరు ఈతరం నాయకులకు స్ఫూర్తినిస్తోంది.
కటిక పేదరికంలో పుట్టి
బక్కనిది షాద్ నగర్ నియోజకవర్గంలోని లింగారెడ్డిగూడ. కటిక పేదరికంలో పుట్టారు. ఎన్నో అష్టకష్టాలు పడ్డారు. చిన్నప్పట్నుంచే వివేకానందుడు అన్నా, ఆయన బోధనలు అన్నా అపారమైన ఇష్టం. వివేకానందుడి జీవిత చరిత్రతో పాటు ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు చదివారు. అందుకే బక్కని పెళ్లిచేసుకోకుండా అవివాహితుడిగా ఉండిపోయారు. ఎంతో క్రమశిక్షణగా పెరిగిన బక్కనిని ఎన్టీఆర్ ఆదర్శాలు ఆకట్టుకుంటాయి. 1983లో టీడీపీ సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించారు. అన్నీ తానై టీడీపీ పార్టీ కోసం శక్తివంచన లేకుండా పనిచేశారు. ఎన్టీఆర్‌కు నమ్మినబంటుగా పేరు తెచ్చుకున్నారు.
బిల్ గేట్స్ ను రప్పించారు
1994 లో ఎన్నికల్లో షాద్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బక్కని ఎక్కడికి వెళ్లినా స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు ఇస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రతి కార్యకర్తను పేరు పెట్టి పిలవడం బక్కని ప్రత్యేకత. ఇప్పటికీ ఎంతోమంది కార్యకర్తల పేర్లు బక్కనికి తెలుసునని ఆయన సన్నిహతులు చెప్తుంటారు. ఇక ఎమ్మెల్యేగా షాద్ నగర్‌కు విశేష గుర్తింపు తీసుకువచ్చారు. బక్కని హయాంలోనే మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు షాద్ నగర్ కు రావడం మరిచిపోలేని విషయం
జీవితం టీడీపీకే అంకితం
ఎమ్మెల్యేగానే కాకుండా.. సగటు మనిషిగా బక్కనికి మంచిపేరుంది. ఇతర పార్టీలో చేరుందుకు ఎన్నో ఆఫర్లు వచ్చినా… ఎంతోమంది ప్రలోభ పెటినా… టీడీపీని వీడలేదు. ఎన్టీఆర్ పట్ల ఎలాంటి విధేయత చూపారో.. చంద్రబాబు పట్ల అంతే విధయతను ప్రదర్శించారు. ఆయన చేసిన సేవలే నేడు టీడీపీ అధక్ష పదవీని తెచ్చిపెట్టాయి. పార్టీలో ఎంతోమంది నేతలు ఉన్నా చంద్రబాబు బక్కని వైపు మొగ్గుచూపారు. బక్కని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. పుట్టుక ఆయనది, చావు ఆయనది.. బతుకంతా టీడీపీది అని చెప్పక తప్పదు.
Must Read ;- ఎల్.రమణ ఎగ్జిట్ తో టీ టీడీపీకి శని వదిలిందట