Sputnik V Vaccine Effective Against Delta And Other New Corona Variants :
గామా, ఆల్ఫా, బీటా, డేల్టా.. ఇలా రకరకరాల వైరస్ లు మనుషులపై దాడి చేస్తున్నాయి. ఈ వైరస్ ల నుంచి బయటపడేందుకు ఒక్కో దేశం.. ఒక్కో టీకాను సూచిస్తున్నాయి. అన్ని వైరస్ లకు చెక్ పెట్టే టీకాయే లేదా? అనే సందేహాలు చాలామందికి వస్తున్నాయి. రష్యా ఉత్పత్తి చేస్తున్న స్పుత్నిక్ కొత్త వేరియంట్లకు వ్యతిరేకంగా పోరాడుతోంది. పలు హెల్త్ సర్వేలు పరిశోధనలు చేసి మరి ఈ విషయాన్ని చెప్పాయి. తాజాగా రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ పరిశీలనలో స్పుత్నిక్ అన్ని వైరస్ పై ప్రభావం చూపుతుందని, ఇతర దేశాల్లో ఈ టీకా పనితీరు బాగుందని స్పష్టం చేసింది.
94శాతం ప్రభావం
కరోనా పోరులో ఇతర వ్యాక్సిన్ పనిచేసినప్పటికీ స్పుత్నిక్ మాత్రం తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ టీకా తీసుకోవడానికి ఇష్టం చూపుతున్నారు. కొవిడ్ అరికట్టే రోగ నిరోధక లక్షణాలు 94 శాతం మేరకు ఉన్నట్టు ఇప్పటికే తేలింది. ఇక కరోనా సోకినవాళ్లు సింగిల్ డోస్ తోనే సురక్షితంగా ఉండొచ్చు. రెండో డోసు కూడా వేసుకుంటే యాంటీబాడీలు పెరగడంతో పాటు న్యూట్రలైజింగ్ సామర్థ్యం పెంచుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో ఆశించిన మేరకు వ్యాక్సిన్లు అందుబాటులో లేకున్నప్పటికీ ప్రధాన నగరాల్లో దొరుకుతున్నాయి. ఈ టీకా పంపిణీ చేసేందుకు సీరం సంస్థ ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించింది.
Must Read ;- స్పుత్నిక్.. సింగిల్ డోసు చాలు!