‘బాణం’ సినిమాతో నారా రోహిత్ ను హీరోగా లాంచ్ చేశాడు దర్శకుడు చైతన్య దంతులూరి. ఆ సినిమా విడుదలై దాదాపు పదకొండు ఏళ్ళయింది. తొలి సినిమాతో ఫ్లాప్ టేస్ట్ చేసినప్పటికీ అతడి టేకింగ్ కు మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత బ్రహ్మానందం తనయుడు గౌతమ్ తో ‘బసంతి’ అనే మూవీని డైరెక్ట్ చేశాడు. అది కూడా బాక్సీఫీస్ వద్ద బోల్తాకొట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ చైతన్య మరో సినిమాని డైరక్ట్ చేయలేదు. కథలు మాత్రం రెడీ చేసుకొని హీరోల కోసం వెతుకున్నాడు.
ఈ నేపథ్యంలో యంగ్ హీరో శ్రీవిష్ణు.. చైతన్య కథకు బాగా ఇంప్రెస్ అయ్యాడట. సినిమాకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట. ‘బ్రోచేవారెవరురా’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు శ్రీవిష్ణు. మరికొన్ని సినిమాలు ప్లానింగ్ లో ఉన్నాయి. శ్రీవిష్ణు గతంలో కొన్ని పరాజయాలు ఎదుర్కొన్నప్పటికీ.. అతడు మంచి పెర్ఫార్మర్ కాబట్టి.. ఈ కాంబో పై మంచి అంచనాలున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. 2021 ప్రథమార్థంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. మరి చైతన్య దంతులూరి ఈ సినిమాతోనైనా సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.