‘షో’కిల్లా భామ శ్రీముఖి డేటింగ్ చేస్తోందా?.. అదేమిటో ఈ మధ్య ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బుల్లి తెర మీద ఆమె స్టార్ యాంకర్. యాంకర్ల మీద హాట్ వార్తలు కామన్ గానే వస్తుంటాయి. రష్మి, సుధీర్ ల మీద కూడా ఇలాంటి పుకార్లు ఎన్నో వస్తుంటాయి. వీటిని వారు కూడా అంత సీరియస్ గా పట్టించుకోరు. బిగ్ బాస్ లో పాల్గొన్నాక శ్రీముఖి క్రేజీ స్టార్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో ఆమె చాలా చురుకుగా ఉంటారు. ఒకప్పుడైతే ఆమె టిక్ టాక్ లు కూడా చేసేది.
ఇక అసలు విషయానికి వద్దాం. ఆమె పెళ్లీడుకొచ్చిన వయసులో ఉంది.. అందరూ పెళ్లెప్పుడని అడుగుతూ ఉంటారు. అయినా నవ్వుతూనే సమాధానం దాటవేస్తుంటుంది. మనకు అందుతున్న తాజా సమాచారం ఏమిటంటే త్వరలోనే ఆమె పెళ్లి పీటల మీదికి ఎక్కబోతోందట. అయితే ఇది పెద్దలు కుదిర్చిన వివాహం కాకపోవడానికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తన జీవిత భాగస్వామిని ఆమె ఎంపిక చేసుకున్నారని, ప్రస్తుతం అతనితో డేటింగులో ఉన్నారన్న ప్రచారం మాత్రం బాగా జరుగుతోంది.
దీన్ని ఖండిస్తూ ఆమె ఎలాంటి ప్రకటనా చేయలదు. గతంలో ఒకసారి తను ప్రేమ వివాహం చేసుకోనని ఆమె తేల్చి చెప్పింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి మాత్రమే చేసుకుంటానని అంది. ఇప్పుడు మాత్రం ఇలాంటి ప్రచారం జరుగుతోంది. డేటింగులో ఆమె ఉన్నది వాస్తవమైతే అమ్మానాన్నలకు ఆ విషయాన్ని చెప్పేసే ఉంటుంది. ఇంతకీ ఆమెతో డేటింగు చేస్తున్న వ్యక్తి సమాచారం మాత్రం బయటికి రావడం లేదు.
కెరీర్ పరంగా చూస్తే యాంకర్ గా ఆమె బిజీ ఏ మాత్రమూ తగ్గలేదు. ‘బొమ్మ అదిరింది’ పేరుతో ఓ షో చేస్తోంది. అలాగే ఓ ఉమెనియా పేరుతో ఓ టాక్ షో కూడా చేస్తోంది. ఇది తన యూట్యూబ్ ఛానెల్ కోసం ఆమె స్వయంగా చేస్తున్న షో. నటిగానూ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న ప్రయత్నాలు చేస్తోంది. మొత్తానికి డేటింగు పేరుతో నైనా ఆమె ఇలా వార్తల్లో నిలుస్తోంది. అందులోని నిజానిజాలను ఆమె వెల్లడి చేస్తేనే బాగుంటుంది.
Must Read ;- పొలిటీషియన్ కుమార్తెతో యాంకర్ ప్రదీప్ పెళ్లి











