శ్రీముఖి అంటే అందం .. అల్లరి .. సంతోషం .. సంబరం .. నిండుదనం .. పండుగదనం. శ్రీముఖికి ఒక యాంకర్ స్థాయిని దాటిన క్రేజ్ ఉంది. నిజం చెప్పాలంటే ఒక స్టార్ హీరోయిన్ కి ఉండవలసిన ఫాలోయింగ్ ఆమెకి ఉంది. బుల్లితెరపై గలగలమని పారే అందాల సెలేరులా కనిపిస్తూ ఆమె తన అభిమానుల సంఖ్యను పెంచుకుంది. ఇక ఇటీవల ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలు ఇన్ స్టాలో వదులుతూ తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటోంది. అలాంటి శ్రీముఖి .. యాంకర్ ప్రదీప్ ను పెళ్లాడనుందనే టాక్ కొన్ని రోజుల క్రితం గుప్పుమంది.
ఒక టీవీ చానల్లో ‘డ్రామా జూనియర్స్’ కార్యక్రమానికి ప్రదీప్ యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ స్టేజ్ పై శ్రీముఖి తళుక్కున మెరిసింది. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’లో శ్రీదేవి తరహాలో ‘మానవా మానవా’ అంటూ సందడి చేసింది. “నేను ఎప్పటి నుంచో నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను .. నువ్వు సిద్ధమేనా” అంటూ ఫన్నీగా అడుగుతుంది. “నేను ఐదేళ్లుగా సిద్ధంగానే ఉన్నాను” అంటూ ప్రదీప్ తనదైన స్టైల్లో చెప్పాడు. దాంతో శ్రీముఖి సిగ్గుపడిపోతూ ‘ఐ లవ్ యు’ అనేసింది. అసలు ఆ మాటనే కొత్తగా వింటున్నట్టుగా ప్రదీప్ మెలికలు తిరిగిపోయాడు.
ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న సునీతతో పాటు ఎస్వీ కృష్ణారెడ్డి .. అలీ కూడా షాక్ అయ్యారు. ఈ కార్యక్రమానికి హైప్ తీసుకురావడానికి ఈ ప్రోమోను వదిలారు. దాంతో పుకారిస్టులు ఈ విషయాన్ని శ్రీముఖి – ప్రదీప్ ల పెళ్లివరకూ తీసుకెళ్లిపోయారు. స్టేజ్ పై ఒకరిని ఒకరు అరుచుకోవడం .. ప్రోగ్రామ్ మధ్యలో బటన్ మైకులు విసిరికొట్టి వెళ్లిపోవడం .. పెళ్లిళ్లు చేయడం వంటివి అందరి దృష్టిని మళ్లించే ప్రయత్నాల్లో భాగంగా జరుగుతుంటాయి .. ఇది కూడా అలాంటిదే. కాకపోతే శ్రీముఖి చిలిపితనం వలన చూడటానికి ముద్దుగా .. ముచ్చటగా ఉంటుందంతే.
Must Read ;- ఇన్ స్టాలో అందంగా మెరుస్తోన్న శ్రీముఖి











